TRINETHRAM NEWS

కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు

దేశంలో తీసుకురానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించిన బిల్లుకు ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Trinethram News : న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025-26 సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా కొత్త చట్టానికి సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశమై, కొత్త ఇన్‌కం ట్యాక్స్ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. దేశంలో 1961 నుంచి ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టాలను మరింత సరళీకరణ చేసి, మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Income Tax Bill