ఎన్డీఏ కూటమి పాలనలో పేదవారికి తీరని నష్టం
సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు శైలి మారలేదు
వైయస్సార్ పార్టీ శ్రేణులపై వేధింపులు దాడులు
బాబు షూరిటీ చార్జీల పెంచి బాదుడు గ్యారెంటీ
మోసపోయిన ప్రజల వైపు వైయస్సార్సీపీ పోరాటం
ముఖ్యమంత్రి జగన్ పాలనలోనే అభివృద్ధి సంక్షేమం
సీతారాంపురంలో నా కార్యకర్తలు-నా కుటుంబం శ్రీకారం
మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజం
Trinethram News : రాజానగరం : ఎన్డీఏ పాలనలో ప్రతి పేదవాడికి నష్టం జరిగిందని,ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు,అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పించుకునే చర్యలకు పూనుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు.
నియోజకవర్గంలోని రాజానగరం మండలం సీతారాంపురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం నా కార్యకర్తలు,నా కుటుంబం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి,వైయస్సార్ పార్టీ బలోపేతం కోసం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి చర్యలు చేపట్టారు.
పార్టీ శ్రేణులతో విడివిడిగా చర్చలు జరిపి,పార్టీ బలోపేతం కోసం సమీక్షించారు. ఈసందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా,వివిధ బాధ్యతలలో నియమితు లైన వైయస్సార్సీపి నాయకులు పలువురిని సీనియర్ నాయకులు మేడా గురుదత్త ప్రసాద్ తో కలిసి ఆయన ఘనంగా సత్కరించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన, కార్యకర్తలపైన,దాడులు వేధింపులు, కేసులు, ఇబ్బందులు పెట్టడంపైనే ఈఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించిందని విమర్శించారు.వారి తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని హెచ్చరించారు.
సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మాట ఎలా ఉన్నా, చార్జీలు పెంచడం ద్వారా,బాబు షూరిటీ బాదుడు గ్యారెంటీ అన్న చందంగా మాత్రం ఉందని జక్కంపూడి ధ్వజమెత్తారు.
ఇసుక,మద్యం,మట్టి ఇలా అన్ని విధాల దోపిడీ జరుగుతుందని విమర్శించారు. మోసపోయిన ప్రజలకు ధైర్యం చెప్పి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుందన్నారు.
నా కార్యకర్తలు నా కుటుంబం పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం ద్వారా ఎన్డీఏ కూటమి పాలనలో అక్రమాలను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు.సామాన్య కార్యకర్త స్థాయి నుండి క్యాబినెట్ మంత్రి స్థాయికి ఎదిగిన తన తండ్రి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్రావు, అదే సంకల్పంతో జక్కంపూడి కుటుంబంతో పార్టీ శ్రేణులు అండగా ఉన్నారన్నారు.
ప్రజలకు భరోసాగా నిలవాలన్న ఉద్దేశంతోనే కార్యకర్తలు అందరిని సమాయత్తపరిచి ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగే అవినీతి,అక్రమలు ఇసుక, మట్టి, దోపిడీలపై ఎదుర్కోవడం జరుగుతుందని వెల్లడించారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే అభివృద్ధి,సంక్షేమం సాధ్య పడిందని తెలియజేశారు. ఇది ప్రజలు గమనించారని తెలియజేశారు.
ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన ఈఎన్డీఏ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని, రానున్న రోజుల్లో ఈఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.రానున్న రోజుల్లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడం ఖాయమని, దేశంలోనే ఒక గుర్తింపు పొందే విధంగా వైయస్సార్ పార్టీ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈసమావేశంలో వైస్సార్సీపీ నాయకులు మేడ గురుదత్త ప్రసాద్, అడబాల చిన్నబాబు, జడ్పిటిసిలు వాసంశెట్టి పెద్ద వెంకన్న,కర్రి నాగేశ్వరరావు,అడపా కనక రాజు,మండారపు వీర్రాజు,గండి నాని బాబు, కొలపాటి వెంకన్న, కొండపల్లి దుర్గారావు, వల్లభశెట్టి బాబ్జి,కంటే వినయ్ తేజ,బొరుసు బద్రి, అడబాల జగదీష్,
మారిశెట్టి తేజో నాయుడు వైయస్సార్సీపి రైతు విభాగం జిల్లా కార్యదర్శి మండపాక శ్రీను,తోరాటి శ్రీను, మిర్తిపాడు సాయి, నియోజక వర్గంలోని వివిధ గ్రామాల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App