
డిండి (గుండ్లపల్లి) మార్చి 18 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని హాజ్య తండా గ్రామ పంచాయతీ సమీపంలో ఎదు రెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
ఈ ఘటన సోమవారం రోజున డిండి మండలం హజ్య తండా సమీపంలో జరిగింది.
ఈ ఘటనకు సంభందించిన వివరాల్లోకి వెళితే డిండి మండలం శేషాయి కుంటకు చెందిన ఇంజమూరి సాయి(22) సం “లు తవకాలాపూర్ గ్రామం నుంచి తన స్వగ్రామానికి బైక్ పై వెళ్తుండగా, కొత్త తండాకు చెందిన జటవత్ శక్రు నాయక్ (55)సం,””లు తన బైక్ పై చెర్కు పల్లి నుండి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో హాజ్యా తండా సమీపంలో రెండు బైకులు ఎదు రెదురుగా ఢీ కొన్నాయి,ఈ ప్రమాదంలో సాయి మరియు శక్రూ నాయక్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు, సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన పై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ రాజు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
