భక్తులకు టీటీడీ కీలక సూచనలు
తిరుమలలో వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల పంపిణీ నేటితో ముగియనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 19తో వైకుంఠద్వార దర్శనం ముగుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 20న దర్శనం చేసుకునే భక్తులను సర్వదర్శనం క్యూలైన్లో మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఈ నెల 20న ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకుని భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App