80 కొత్త బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ -త్వరలో 1000 ఎలక్ట్రీక్ బస్సులు
నిత్యం ప్రజలకు ఏదొక మార్గంలో చేరువలో ఉంటున్న సంస్థ ఈసారి అధునాతన బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద 80 ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ అండ్ సీటర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో త్వరలోనే వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని ఎండీ సజ్జనార్ చెప్పారు. అందులో 500హైదరాబాద్కు మరో 500 బస్సులు జిల్లాలో తిరగనున్నాయని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి 20రోజుల్లో రోజుకు 30లక్షల మంది ఉచిత ప్రయాణం చేస్తున్నారని ఆయన తెలిపారు.