TRINETHRAM NEWS

సాయం చేయడం ద్వారా పేదలకు ఆనందాన్ని పంచడమే నిజమైన సంక్రాంతి

Trinethram News : ఒంగోలు:13-1-24:
సాయం చేయడం ద్వారా పేదలకు ఆనందాన్ని పంచడమే నిజమైన సంక్రాంతి అని,సాటివారి కష్ట సుఖాల్లో మేమున్నామనే భరోసాను కల్పించడమే సంక్రాంతి అని సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ అన్నారు.

సూర్య శ్రీ దివ్యాంగులచారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్మార్ట్ ఐ ఎం ఎస్ అమర్ రెడ్డి గారి ఆర్థిక సహకారంతో వందమంది పేదలకు లక్ష రూపాయలు విలువ గల బియ్యము నిత్యవసర వస్తువులను ట్రస్టు నిర్వాహకులు షేక్ సర్దార్ భాషా షహనాజ్ దంపతుల ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూల్ రోడ్ లోని సూర్య శ్రీ ట్రస్ట్ ఆవరణలో శనివారం పంపిణీ చేయడం జరిగింది.

ట్రస్టు సెక్రెటరీ సర్దార్ భాషా మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మా ట్రస్టు ద్వారా క్రిస్టమస్ రంజాన్ సంక్రాంతి పండుగల సందర్భంగా పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతిని పేదలు కూడా పండుగ చేసుకోవాలని ఉద్దేశంతో సరుకులు అందించి వారి కళ్ళల్లో వెలుగులు నింపామన్నారు.
స్మార్ట్ ఐ ఎం ఎస్ నిర్వాహకులు పి. చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా సంస్థ ద్వారా సంక్రాంతికి పేదలకు సూర్యశ్రీ ట్రస్ట్ ద్వారా నిత్యవసర అందిస్తున్నామని తెలిపారు
డాక్టర్ చాపల వంశీకృష్ణ మాట్లాడుతూ సూర్యశ్రీ ట్రస్ట్ సంక్రాంతి రోజు నిజమైన పేదలకు పిండి వంటలు చేసుకొనుటకు నిత్యవసర సరుకులు అందించి మానవత్వం చాటారని తెలిపారు.

ఈ సేవ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు. ట్రస్ట్ గౌరవ సభ్యులు మండవ సుబ్బారావు. కోచూరి శ్రీదేవి స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ . బొడ్డపాటి వెంకట్. రాయపాటి రవి కిరణ్. మీసేవ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.