ఇచ్చిన మాట నిలబెట్టుకున్న VHR ఫౌండేషన్ ఫౌండర్, టిఆర్ఎస్ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి 30000 రూపాయల ఆర్థికసాయం
పదవ తరగతి వరకు చిన్నారుల చదువుకు ఆర్థిక సాయం
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం నియోజకవర్గం 40 వ డివిజన్, గాంధీనగర్ పరిధిలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బండారి సంతోష్, కుటుంబానికి భవిష్యత్తులో వారి పిల్లల చదువుకు అండగా ఉంటానని వ్యాల్ల హరీష్ రెడ్డి ప్రకటించారు, అన్నట్టుగానే ఈ సంవత్సరం వాల్ల చదువు నిమిత్తం 30000/- రూపాయల ఆర్థిక సాయన్ని ఆదివారం VHR ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ 40 వ డివిజన్ అధ్యక్షులు చల్లా రవీందర్ రెడ్డి చేతుల మీదుగా మృతుడు బండారి సంతోష్ కుటుంబ సభ్యులకు అందజేశారు
ఈ సందర్భంగా చల్లా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు భరోసానిస్తూ, వెంటనే స్పందిస్తూ, ఎంతటి సాయన్నైన చేయడానికి ముందుకు వస్తున్న ఫౌండేషన్ ఫౌండర్ హరీష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గానీ పేద ప్రజలకు కానీ రానున్న రోజుల్లో, ఏ కష్టం ఉన్న హరీష్ రెడ్డి ముందుంటారని ఆయన తెలిపారు, ఈ సందర్భంగా 40 డివిజన్ ప్రజలందరి తరఫున హరీష్ రెడ్డికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో VHR ఫౌండేషన్ 40 వ డివిజన్ ఇంచార్జ్ సిగిరి తిరుపతి తో పాటు, ఫౌండేషన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కాలనీవాసులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App