
త్రిష ట్విట్టర్ హ్యాక్..షాక్‌లో ఫ్యాన్స్
Trinethram News : త్రిష తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో షేర్ అయిన కొన్ని పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసి అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎక్కువగా సినిమా విషయాలే కనిపించే త్రిష ట్విట్టర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీ గురించి చేసిన పోస్టులు నెట్టింట వైరల్ అయ్యాయి.
అయితే వీటిని గమనించిన త్రిష వెంటనే అలర్ట్ అయ్యింది. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని గ్రహించింది. దానిని వెంటనే ఇన్ స్టాగ్రమ్ ద్వారా అభిమానులకు తెలియజేసింది.
నా ట్విట్టర్ హ్యాక్ అయింది. సరిదిద్దే వరకు నా నుంచి ఎలాంటి పోస్ట్ లు రావు.. ధన్యవాదాలు’ అని తన ఫాలోవర్లకు తెలియజేసింది.
దీంతో ఈ విషయాన్ని గ్రహించిన త్రిష తాను క్రిప్టో గురించి ఎలాంటి పోస్టులు చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
