కరీంనగర్ జిల్లా మల్టీ జోన్ పరిధిలో పదిమంది సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీ
కరీంనగర్ జిల్లా: జనవరి 21
కరీంనగర్ జిల్లా మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న 10 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజిపి తరుణ్ జోషి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
గత వారం జారీ చేసిన బదిలీ ఉత్తర్వులకు బదులుగా మరో ఉత్తర్వు జారీ చేశారు.
మంథని సిఐగా పనిచేసిన సతీష్ ను ధర్మపురికి గత వారం బదిలీ చేయగా దానికి బదులుగా ఐజి కార్యాలయానికి, బుద్దే స్వామిని జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ కు బదులుగా రామగుండం సిసిఆర్బికి, జగిత్యాల పట్టణ సిఐ నటేష్ ను అక్కడే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
భూపాలపల్లి లో పని చేస్తున్న రామ్ నరసిం హారెడ్డిని ధర్మపురి సిఐ గా, కరీంనగర్ సిసిఆర్బి లో పనిచేస్తున్న దామోదర్ రెడ్డిని మల్యాల సిఐగా, డిసిఆర్బి నిర్మల్ లో పనిచేస్తున్న నాగపురి శ్రీనివాస్ ను భీమ్గల్ సిఐ గా, సిఐడీ లో పనిచేసిన శ్రీలత ను కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ కు,బదిలీ చేశారు.
ఇటీవల మల్యాలకు బదిలీ అయిన నాగేశ్వరరావును జగిత్యాల సిసిఎస్ కు, సిసిఆర్బి రామగుండంలో పనిచేస్తున్న ఆకుల అశోక్, భీంగల్ లో పనిచేసిన వెంకటేశ్వర్లు ను ఐజి కార్యాలయానికి, కరీంనగర్ మహిళా టాన్ లో పనిచేస్తున్న శ్రీనివాసులు ఐజి కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.