Traffic restrictions in Hyderabad today
హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
Trinethram News : హైదరాబాద్
మొహర్రం ఊరేగింపుకు హైదరాబాద్ సిద్దమైంది. పాతబస్తీలో బీబీ-కా-ఆలం ఊరేగింపు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
మొహర్రం సంతాప దినంలో భాగంగా అంబారీపై బయ లుదేరిన డబీర్‌పురాలోని బీబీ-కా-ఆలం నుంచి బీబీ-కా-ఆలం ఊరేగింపు చార్మినార్ మీదుగా సాగనుంది.
పెద్ద సంఖ్యలో షియా ముస్లిం సోదరులు… కత్తులు, బ్లేడ్లతో శరీరాలను కోసుకుని రక్తం కారుస్తూ రోదించారు. చార్మినార్ వద్ద బీబీ-కా-ఆలం చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చా రు.
ఊరేగింపు డబీర్‌పురా లోని బీబీ-కా-ఆలం నుండి ప్రారంభమై, అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్‌హౌజ్, పంజేషా, మీరాలం మండి, దారుల్ షిఫా మీదుగా సాగి చాదర్‌ఘాట్‌లో ముగు స్తుంది.
మరోవైపు బీబీకా ఆలం ఊరేగింపు నేపథ్యంలో పాతబస్తీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తు న్నట్లు ఆయన వెల్లడించా రు. ఆర్టీసీ బస్సులు రంగ మహల్, అఫ్జల్‌గంజ్ నుండి ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ప్రవేశించి నిష్క్రమిస్తాయి. కాలికబర్, మీరాలం మండి మార్గాల్లో ఊరేగింపు వచ్చే వరకు అనుమతి ఇస్తామని తెలిపారు.
సికింద్రాబాద్ ప్రాంతంలో – సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు ట్యాంక్‌బండ్ నుండి కర్బలా మైదాన్ మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహ నాలు చిల్డ్రన్స్ పార్క్ నుండి కవాడిగూడ, బైబిల్ హౌస్, ఆర్‌పి రోడ్డు వైపు వెళ్లాలని సూచించారు.
ఆర్పీ రోడ్డు నుంచి కర్బలా మైదాన్ మీదుగా వెళ్లే వాహనాలు కవాడిగూడ ఎక్స్ రోడ్స్, బైబిల్ హౌస్ వద్ద డీబీఆర్ మిల్స్ టీ జంక్షన్ వైపు వెళ్లాలని తెలిపారు. ఎంజీ రోడ్డులోని సెంట్రల్ టెలిగ్రాఫ్ ఐలాండ్, రాణిగంజ్ మార్గంలో వన్ వే ఉంటుందని, అవసరమైతే రాణిగంజ్ వద్ద ట్రాఫిక్‌ను మినిస్టర్ రోడ్డులో మళ్లిస్తా మని అదనపు సీపీ వివరించారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App