TRINETHRAM NEWS

రేపు శ్రీ తిమ్మప్ప స్వామి ధ్వజారోహణం

ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సకల దేవతలను ఆహ్వానించేందుకు నిర్వహించే ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుందని దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు, కార్యనిర్వహణాధికారి సత్య చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సంతానము కలగని వారు బజారోహణం రోజు తీసుకునే ప్రసాదం వల్ల సంతానం కలుగుతుందని ఇక్కడ ఆనవాయితీ ఉంది. గతంలో అనేకమంది సంతానం లేని వారు ధ్వజారోహణం రోజు ప్రసాదం తీసుకుని సంతానం పొందారు. ఈసారి కూడా ఉదయం 7 గంటల నుండి దేవాలయానికి వస్తున్నట్లు తెలిసింది. ఆగమ పద్ధతిలో నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలతో సూర్యప్రభ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరుగుతుందని తెలిపారు.
భక్తులకు త్రాగునీటి సరఫరా….
మల్దకల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మల్దకల్ జాతరకు వచ్చే భక్తాదులకు త్రాగునీటి సరఫరా కై మూడు ట్యాంకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మల్దకల్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ గంగాధరం తెలిపారు. శుక్రవారం ఉదయం 3 ట్యాంకర్లను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలకు త్రాగునీరు అందిస్తామని తెలిపారు. గత కొన్నాళ్లుగా యూనియన్ బ్యాంకు వారు భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేస్తున్నారు.