TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.. ఓవైపు ఢిల్లీ వేదికగా.. ఈ రోజు టీడీపీ-జనసే-బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా..

మరోవైపు.. కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించేపనిలో పడిపోయింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయమైపోయింది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ముద్రగడ నివాసానికి వెళ్లనున్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి.. జిల్లా పార్టీ నేతలతో కలిసి కిర్లంపూడి వెళ్లనున్న మిథున్ రెడ్డి.. ముద్రగడతో సమావేశం కానున్నారు.. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనుంది వైసీపీ బృందం.. మరోవైపు.. పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరికి ఈ ఎన్నికల కోడ్ రాకముందే నామినేటెడ్ పదవిపై హామీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ విషయాన్నే స్వయంగా ముద్రగడకు వివరించనున్నారట మిథున్‌రెడ్డి..