TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు నవంబర్ 16

Trinethram News : సంఘటనలు

1937: కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య శ్రీ బాగ్ ఒడంబడిక కుదిరింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం.

1965: రష్యా ప్రయోగించిన వీనస్-3 అంతరిక్షనౌక శుక్రగ్రహం వైపు ప్రయాణం ప్రారంభించింది.

1966: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఈ రోజును భారత్‌లో జాతీయ పత్రికా దినంగా జరుపుకుంటారు.

జననాలు

1890: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త. (మ.1973)

1901: జవ్వాది లక్ష్మయ్యనాయుడు, కళాపోషకులు, శాసనసభ సభ్యులు. (మ.1978)

1908: తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (BN రెడ్డి) జననం. (మ.1977)

1923: టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (మ.2009)

1930: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (మ.2013)

1931: వి.ఎల్.ఎస్.భీమశంకరం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ విభాగపు అధిపతిగా పనిచేశారు

1936: రామోజీరావు, భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు. (మ. 2024)

1963 : భారతీయ సినిమా నటి మీనాక్షి శేషాద్రి జననం.

1973: పుల్లెల గోపీచంద్, భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.

1973: ఆమని, తెలుగు, తమిళ సినిమా నటి

జాతీయ దినాలు

జాతీయ పత్రికా దినోత్సవం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App