TRINETHRAM NEWS

Today is July 1 in history

Trinethram News : సంఘటనలు

1949: ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారతదేశపు పార్లమెంటు, ఈ రోజు న 1949 లో ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ చట్టం చేసింది. అందుకోసం, భారతదేశంలోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఏ.ఐ), ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ అందరూ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ డేని జరుపుకుంటున్నారు

1949: కొచిన్, ట్రావెన్కోర్ అనే రెండు సంస్థానాలను కలిపి తిరు-కోచి రాష్ట్రంగా (తరువాత ఈ రాష్ట్రాన్ని కేరళ రాష్ట్రంగా పునర్వవస్తీకరించారు) భారత దేశంలో కలిపి వేసారు. అంతటితో, 1000 సంవత్సరాలుగా పాలిస్తున్న, కొచిన్ రాజకుటుంబం పాలన అంతమయ్యింది.

1955: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.

1960: ఆంధ్రజ్యోతి దినపత్రిక విజయవాడ నుంచి ప్రారంభించబడింది.

1957: ప్రపంచ భూ భౌతిక సంవత్సరంగా 1957 సంవత్సరాన్ని, యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది

1960: ఘనా రిపబ్లిక్ దినోత్సవం.

1962: బురుండి, రువాండా దేశాలకు స్వాతంత్ర్యము లభించింది.

1963: అమెరికాలోని తపాలా కార్యాలయాలు 5 అంకెలు గల జిప్ కోడ్‌ను (జోనల్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్) ప్రవేశపెట్టాయి.

1990: జనరల్ ఎస్.ఎఫ్. రోడ్రిగ్స్ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

1993: జనరల్ బి.సి.జోషి భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

1997: బ్రిటన్ 156 సంవత్సరాల బ్రిటిష్ వలస అయిన ‘హాంకాంగ్ ‘ ని చైనాకు తిరిగి ఇచ్చింది.

2002: సోమాలియా స్వాతంత్ర్య దినం.

2008: ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది.

జననాలు

1882: బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు. (మ.1962)

1904: పి. చంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (మ.1976)

1949: వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు.

1949: సురభి బాబ్జీ, సురభి నాటక నిర్వాహకుడు (మ. 2022)

1950: ఎ.కోదండరామిరెడ్డి, తెలుగు చలనచిత్ర దర్శకుడు.

1964: అచ్యుత్, తెలుగు టెలివిజన్, సినీ నటుడు.

1974: గోపి మోహన్, తెలుగు కథా రచయిత, స్క్రీన్ ప్లే

1986: సితార: భారతీయ సినీ నేపథ్య గాయిని.

1992: రియా చక్రవర్తి , భారతీయ సినీనటి

1996: శివాని రాజశేఖర్, సినీ నటి,నిర్మాత.

మరణాలు

1962: బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు. (జ.1882)

1966: దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆధునిక తెలుగుకవి. (జ.1921)

1991: పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (జ.1917)

1992: తాతినేని ప్రకాశరావు, తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు. (జ.1924)

జాతీయ దినాలు

జాతీయ వైద్యుల దినోత్సవం – బి.సి.రాయ్ జయంతి, వర్ధంతి దినం.

ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారత దేశంలో..

జాతీయ తపాలా వర్కర్స్ డే

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Today is July 1 in history.