TRINETHRAM NEWS

Trinethram News : చరిత్రలో ఈరోజు జనవరి 8

సంఘటనలు

1965 : అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం ‘స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ తిరిగి లభ్యమైంది.

1962: లియోనార్డో డావిన్సీ అద్భుతసృష్టి ‘మోనాలిసా’ పెయింటింగ్‌ను అమెరికాలో తొలిసారి ప్రదర్శనకు పెట్టారు.

1995: ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్‌.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.

జననాలు

1942: స్టీఫెన్ విలియం హాకింగ్, భౌతిక శాస్త్రవేత్త (మ. 2018)

1947: డేవిడ్ బౌవీ, ఆంగ్ల సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్ నిర్మాత, అరేంజర్. (మ.2016)

1964: భూమా నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017)

1975: తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సంగీత దర్శకుడు హేరిస్ జైరాజ్ జననం.

1983: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు.

1983: తరుణ్, తెలుగు సినిమా నటుడు.

మరణాలు

1642: గెలీలియో, ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త . (జ.1564)

2022: ఘట్టమనేని రమేష్ బాబు, తెలుగు సినిమా నటుడు. (జ.1965)