TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు జనవరి 14

సంఘటనలు

1760: ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న పాండిచ్చేరిని బ్రిటిష్‌ కెప్టెన్‌ ఐరీకూట్‌ (Sir Eyre Coote) స్వాధీనం చేసుకున్నాడు.

1761: మరాఠాలూ అఫ్గాన్ల మధ్య మూడో పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అహ్మద్‌షా అబ్దాలీ సేన విజయం సాధించింది.

1964: ఇంగ్లండుతో జరిగిన ఓ టెస్టుమ్యాచ్‌లో భారత బౌలర్‌ బాపూ నాదకర్ణి వరుసగా 21 మెయిడెన్‌ ఓవర్లు విసిరి రికార్డు సృష్టించాడు. వికెట్లేమీ తీసుకోకున్నా ఆ మ్యాచ్‌లో అతను 32 ఓవర్లు వేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

1969: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చారు.

1987: దూరదర్శన్‌ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాదు నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 16 ప్రాంతాలలో ఉన్న ట్రాన్స్‌మిటర్లను ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో హైదరాబాద్‌ దూరదర్శన్‌ కేంద్రానికి అనుసంధానించారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే హిందీ కార్యక్రమాలనూ హైదరాబాద్‌ కేంద్రం నుంచి రోజులో కొద్దిసేపు మాత్రమే ప్రసారమయ్యే తెలుగు ప్రసారాలనే ప్రేక్షకులు చూసేవారు.

1998: గానకోకిల ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.

2005: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి.ఎస్.ఎన్.ఎల్) బెంగళురు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత లలో బ్రాడ్‌బాండ్ సేవలను మొదలు పెట్టింది. మరొక 198 నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని ప్రకటించింది.

జననాలు

1892: ‘గ్రాండ్‌ ఓల్డ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌’గా పేరొందిన దినకర్‌ బల్వంత్‌ దేవధర్‌ జననం. ఆయన పేరు మీదే దేవధర్‌ ట్రోఫీ నిర్వహిస్తారు.

1896: సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (మ.1982)

1937: రావు గోపాలరావు, తెలుగు సినిమా నటుడు. (మ.1994)

1937: శోభన్ బాబు, తెలుగు కథానాయకుడు. (మ.2008)

1951: జంధ్యాల, తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (మ.2001)

1956: నాగభైరవ జయప్రకాశ్‌ నారాయణ్‌, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు

1977: నారాయణ్ కార్తికేయన్, భారతదేశానికి చెందిన మొదటి ఫార్ములా వన్ మోటార్ రేసింగ్ డ్రైవరు.

1977: నిమిషా వేదాంతి, భూగర్భ చమురు నిల్వలపై పరిశోధన చేసిన శాస్త్రజ్ఞురాలు.

మరణాలు

2016: మౌలానా అబ్దుల్‌ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (జ.1935)

2017: సూర్జీత్ సింగ్ బర్నాలా, రాజకీయ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1925)

2019: కట్టా రంగారావు తెలుగు సినిమా దర్శకుడు. (జ.1957)

2022: మల్లాది చంద్రశేఖరశాస్త్రి, ప్రముఖ పండితుడు, పురాణ ప్రవాచకుడు. (జ.1925)