TRINETHRAM NEWS

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్ షో తో పాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు తెలుగుదేశం నాయకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత తొలిసారి చంద్రబాబు నెల్లూరు జిల్లాకు వస్తుండడంతో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు శ్రేణులు సిద్ధమయ్యారు. శ్రేణులు భారీ ఎత్తున పాల్గొనే అవకాశం ఉండడంతో రోడ్ షో, సభ వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

అదేవిధంగా చంద్రబాబు ప్రజాగళం యాత్రను విజయవంతం చేయాలని నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి, కావలి ఉమ్మడి అభ్యర్ధులు దగుమాటి కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్ ప్రజలకు పిలుపునిచ్చారు.