To the Singareni workers who contributed to the Kerala Wayanad Flood Relief Fund
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేరళ లోని వయనాడ్ వరద బాధితుల సహాయార్థం ఈరోజు రామగుండం 1 ఏరియాలోని ఎస్&పిసి, ఏరియా వర్క్ షాప్ లలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల వద్ద నుండి వరద సహాయ విరాళాలు సేకరించి, సిఐటియు జిల్లా కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతుందని,
ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచి కార్యదర్శి మెండె శ్రీనివాస్, మాట్లాడుతూ కేరళలోని వయనాడ్ జిల్లాలో అర్ధరాత్రి ప్రజలు గాఢనిద్రలో ఉండగా వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసిందని, ఊహించని ఈ పరిణామం దేశప్రజలను త్రీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలిపారు.
వయనాడ్ లో జరిగిన ప్రకృతి విలయానికి అక్కడ ప్రజలు విగత జీవులయ్యారని,చాలా మంది చెట్టుకొరకు, పుట్టకొకరు అన్నట్టుగా అక్కడ పరిస్తితి వుందని, ప్రధానంగా వయనాద్ ప్రాంతం దారుణంగా దెబ్బతిన్నదని, ఇప్పటికీ ఈ విషాదం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోలేదు.
ఇంకా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. వందల మంది ప్రజలు వరదలు కొట్టుకుపోయారు.
ఊర్లకు ఊర్లే మునిగిపోవడం అత్యంత విషాదకరం. వందల్లో మృతులు ఉంటారని తెలుస్తుంది. వేలల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేరళా ప్రభుత్వం వేగంగా సహాయక చర్యలు చేపడుతుందని తెలిపారు.
సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మానవతా దృక్పథంతో ఈరోజు కార్మికుల వద్ద నుండి విరాళాలు సేకరించి, సిఐటియు జిల్లా కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీకి పంపించడం జరిగిందని, ఈ విరాళాలు ఇచ్చి సహకరించిన కార్మికులకు యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు,
ఈ కార్యక్రమంలో, సిఐటియు బ్రాంచి నాయకులు పి రాజేశ్వర చారి, ఎస్ రవి, ఎస్&పీసీ పిట్ కార్యదర్శి పి శ్రీనివాస్, ఏరియా వర్క్ షాప్ పిట్ కార్యదర్శి నంది నారాయణ, సంతోష్ కుమార్, బాదే రవి, బొద్దుల ఓదెలు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App