TNTUC will block privatization of coal wells
రామగుండం నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం నియోజకవర్గ టిఎన్టియుసి పక్షాన అఖిలపక్ష కమిటీలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి బావులను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏ ఎఫ్ టి యు, తెలంగాణ కార్మిక రాష్ట్ర సమితి, టిఎన్టియుసి మొత్తం ఆరు సంఘాల నాయకులు ముఖ్య సమావేశం జూన్ మూడవ తారీఖు హైదరాబాదులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
సింగరేణి బొగ్గు బావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి ఐక్యవేదిక నాయకులందరము కూడా ఉద్యమిస్తామని అన్నారు. సింగరేణి బావులను పరిరక్షించుకోవడానికి కార్మికులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు ఏకం కావాలని టిఎన్టియుసి పక్షాన పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ప్రైవేటీ కరణ వెనక్కి తీసుకోవాలని టిఎన్టియుసి పక్షాన డిమాండ్ చేశారు.
టీ మణి రామ్ సింగ్ టిఎన్టియుసి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ, కే నిమ్మకాయలు ఏడుకొండలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముదిగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి అధ్యక్షుడు, పెగడపల్లి రాజనర్సు టి ఎన్ టియు సి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి అండ్ ఆఫీస్ ఇంచార్జ్, సుందిళ్ల స్వామి ఎస్సీ సెల్ టౌన్ కార్యదర్శి టిడిపి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App