TRINETHRAM NEWS

డిజాస్టర్ రిలీఫ్ ఈవెంట్ లో చంద్రబాబు ఆలోచనా విధానానికి దగ్గర్లోకి కూడా వెళ్ళగలిగిన వాడు ఈ దేశంలోనే లేడు. ఇది జగమెరిగిన సత్యం, ముమ్మాటికి నిజం !!!

ఉదాహరణలు:

బాబు ఆలోచన ఎలా ఉంటది అంటే

 1. హుదూద్ కి ఒక పది రోజుల ముందు నేను బళ్ళారి వెళ్ళా... ఒక ట్రక్ ఇంజన్ సీజ్ అయింది... ఓపెన్ చేసాక దీనిని బాగు చేయడం మా వల్ల కాదు పొమ్మన్నారు..... ఊడదీసిన ఇంజన్ ఒక వెహికల్ లో వేసుకునిy బెజవాడ వచ్చి వారంలో రెడీ చేసా......

     ఈరోజు రాత్రికి తుఫాన్ తీరం దాటుతుంది అనగా పొద్దున్నే ఆటోనగరం పోయా..... ఇంజన్ ని క్రేన్ తో ఎత్తి వెహికల్ లో పెట్టాలి.....  సాధారణంగా సిటీలలో ఆటోలు తిరిగినట్లు ఆటోనగరంలో క్రేన్లు తిరుగుతుంటాయి....... అలాంటిది  ఎంత వెతికినా   ఒక్క క్రేన్ దొరకలేదు..... ఏంటని ఎంక్వైరీ చేస్తే నిన్ననే మొత్తం క్రేన్లని వైజాగ్ తీసుకెళ్ళారని చెప్పారు.....

అంటే..... తుఫాన్ గాలి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వీస్తుంది , అంత వేగంతో గాలి వీస్తే ఏమేమి డ్యామేజ్ అవుతాయి , డ్యామేజ్ రిలీఫ్ కి ఏమేమి అవసరం అవుతాయి అనే ఒకే ఒక ఆలోచన..... . 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రేన్లను యుద్ధ ప్రాతిపదికన రప్పించే ఆలోచన....  అదీ చంద్రబాబు నాయుడి ముంద చూపుకి నిదర్శనం .......

  ఆ క్రేన్ ల వలననే కరెంట్ ని త్వరగా ఇవ్వగలిగారు
  1. అప్పట్లో విజయవాడ లోని మా సొసైటీ బంకులకు ఒక్కోటి 24,000 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన నాలుగు ట్యాంకర్లు ఉన్నాయి….. మరో 24,000 లీటర్లు సామర్ధ్యం గల సరికొత్త ట్యాంకర్ రెడీ అయినప్పటికి పేపర్ వర్క్ అవకపోవడం వలన ఇంకా రోడ్ ఎక్కలేదు…… రెవిన్యూ అధికారులు వచ్చి నాలుగు ట్యాంకర్లలో రెండిటిని ముందుగా పెట్రోల్ తో కడిగి, తర్వాత డిటర్జంట్ తో కడిగి నీళ్ళు సరఫరాకి పంపమని అడిగారు...... ఎమర్జెన్సీ లో ఏది అడిగినా ఇవ్వాలి కాబట్టి సరే అన్నాం.......... అడగడానికి వచ్చిన అధికారికి.... మా దగ్గర అసలు ఆయిల్ నింపని కొత్త ట్యాంకర్ ఉంది, కానీ కొన్ని పేపర్ వర్క్ అవలేదని చెప్తే , వెంటనే విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళారు..... ఆయన వెంటనే...... ఏం పర్లేదు అని దానిని కూడా తీసుకెళ్లారు... విజయవాడ సమీపంలోని కొండపల్లిలో 3 ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుండి దాదాపు సగం ట్యాంకర్లు ఒక రోజు ముందే వైజాగ్ కి వెళ్ళాయి.....

అదీ చంద్రబాబు నాయుడి పనితనం…

  1. కాస్త లేటుగా మేల్కొనే నాలాంటి వాళ్ళం హుదూద్ తుఫాన్ తీరం దాటిన రెండో రోజున వాళ్ళకి ఏదైనా పంపాలని ఆలోచించి టెట్రా మిల్క్ ప్యాకెట్లైతే కరెక్ట్ అని విజయవాడ మిల్క్ ప్రాజెక్ట్ కి మనిషిని పంపితే…….. ఒక్కటంటే ఒక్క ప్యాకెట్ లేదని చెప్పారు…… విజయవాడ లోని వారి స్టాక్ పాయింట్ల నుండీ కూడా ప్యాకెట్లు వెనక్కు తెప్పించి లారీలకు లోడ్ చేసి నిన్ననే పంపేసాం అన్నారు. ఇదీ చంద్రబాబు నాయుడంటే !!

(టెట్రా మిల్క్ ప్యాకెట్ ఫ్రీజ్ చేయకపోయినా కూడా ఆరు నెలలు చెడిపోకుండా ఉంటాయి)

  1. హుదూద్ అయిపోయిన మూడు నెలల తర్వాత సముద్రం ఒడ్డున ఉన్న తూగో జిల్లాలోని ఒక గ్రామ VRO కలిసాడు……. అతను చెప్పిన మాటలు:

ఆరోజు చీకటి పడే సమయానికి ఇంటికి చేరాను….. తుఫాను ప్రభావం అంతా వైజాగ్ నగరం మీద ఉంటుంది అని తెలిసింది. కొంచెం ఊపిరి పీల్చుకుని ఇంటికి వచ్చిన పది నిమిషాలకు మొబైల్ కి మెసేజ్ వచ్చిన సౌండ్ వచ్చింది. …… పూర్తిగా తెలుగులో వచ్చిన మెసేజ్ సారాంశం ఏంటంటే….. తుఫాను పరిధి(విస్తీర్ణం) చాలా ఎక్కువగా ఉండబోతోంది కాబట్టి మీ గ్రామం లోని ప్రతి ఒక్కరినీ షెల్టర్ లోకి మార్చండి…… అవసరం అయితే… ప్రజలు వినకపోతే పోలీస్ సహాయం తీసుకోండి…… మీ గ్రామంలో ఒక్క ప్రాణం పోయినా మీ మీద తీవ్ర చర్యలు తీసుకోబడతాయి.ఇకపై మొబైల్ కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు కాబట్టి జాగ్రత్త పడండి…

ఆ మెసేజ్ వచ్చిన రెండు గంటల తర్వాత సిగ్నల్స్ లేవు…..

  కమ్యూనికేషన్ సిస్టం దెబ్బ తినే లోపు ఎవరెవరికి ఏమేమి ఆదేశాలు పంపాలో కూడా ఆలోచన చేసాడన్నమాట.....

సో, అందుకే చంద్రబాబుని విజనరి అంటారు