
These are the Brahmastras that won Babu in this election
Trinethram News : ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్సర్ కొట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో వైసీపీ కాళ్ల కింద ల్యాండ్‌మైన్ పేల్చారు. చంద్రబాబు తన బ్రహ్మస్త్రాలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసి, కూటమికి కనీవినీ ఎరుగని విజయం అందించారు.
ఏపీలో ఎన్నికల యుద్ధం హోరాహోరీ జరిగింది. అయితే కౌంటింగ్‌లో మాత్రం వార్ వన్‌సైడ్ అయిపోయింది. కూటమి గాలికి వైసీపీ గల్లంతయిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చంద్రబాబు ముందుండి నడిపించారు. వైసీపీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నడంలో కానీ, మూడు పార్టీలను ఒకే తాటిపై నడిపి, సూపర్ విక్టరీ కొట్టడంలో చంద్రబాబు తన చాతుర్యాన్ని ప్రదర్శించారు.
ఇక ఎన్నికల ప్రచారంలో వైసీపీపై చంద్రబాబు బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారు. వైసీపీ సంక్షేమ పథకాలకు విరుగుడుగా చంద్రబాబు సూపర్ సిక్సర్ ప్రయోగించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఆర్థిక సాయం, ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు…ఇలా వైసీపీ నవ రత్నాలను, తన సంక్షేమ వజ్రాలతో కోసేశారు చంద్రబాబు.
ఇక ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరుకున్నాక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే బ్రహ్మస్త్రాన్ని వైసీపీపై ప్రయోగించారు చంద్రబాబు. మీ భూములను జగన్ లాక్కుంటారు, నేను అధికారంలోకి వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేస్తా అనే ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకు వెళ్లగలిగారు బాబు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ పాశుపతాస్త్రంలా పని చేసింది.
దీనిపై జగన్‌తో పాటు వైసీపీ నేతలు ఎంత స్పందించినా అది పెద్దగా పనిచేయలేదు. బాబు ప్రయోగించిన ల్యాండ్ టైటిలింగ్ అస్త్రం వైసీపీకి భారీగా డ్యామేజ్ చేసిందని చెబుతున్నారు. టైమ్ చూసి చంద్రబాబు ప్రయోగించిన సూపర్ సిక్సర్లు, ల్యాండ్ టైటిలింగ్ అస్త్రాలతో వైసీపీ ఘోర పరాజయం పాలైంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
