మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో అందరి భాగస్వామ్యం ఉండాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో అందరి భాగస్వామ్యం ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్ తెలిపారు.
మంగళవారం వికారాబాద్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రూపనపై మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, ఇంజనీయర్ లు , వార్డు,అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్ మాట్లాడుతూ… నూతనంగా రూపొందించబోయే వికారాబాద్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ కు అందరి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రైతులకు ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మాస్టర్ ప్లాన్ ఉండాలని ఆయన తెలిపారు. పారిశ్రామిక, స్మశాన వాటిక, గృహ అవసరాల కోసం జోన్లను గుర్తించే క్రమంలో కూడా ప్రజలకు ఆమోదయోగంగా ఉండాలని ఆయన సూచించారు. మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడేలా చూడాలని ఆయన తెలిపారు.
మాస్టర్ ప్లాన్ కు సంబంధించి ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని కౌన్సిల్ లో అందరి ఆమోదంతో ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని ఆయన సూచించారు. మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి సౌకర్యాలు కావాలో వ్రాతపూర్వకంగా సమర్పించాలని ఆయన తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి పొరపాట్లు, తప్పులు జరగకుండా ఇంటి ఇంటి సామాజిక ఆర్థిక సర్వేలో భాగంగా ప్రజల అభిప్రాయాలను కూడాతీసుకోవాలనిఆయన సూచించారు. మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో కౌన్సిలర్లు ఇచ్చిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమంలో డిటిసిపి అదనపు డైరెక్టర్ రమేష్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, కమిషనర్ జాకీర్ అహ్మద్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App