There is no history in history that the kingdom of the farmer cried when the bull cried agriculture
చెయ్యి గుర్తుకి ఓటు వేసిన పాపానికి అదే చేత్తో రైతులను నట్టేటా ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..!
- ధర్నా కార్యక్రమంలో కందుల సంధ్యారాణి రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పంట రుణం మాఫీ చేయ్యాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు రామగుండం బిజేపి ఇంచార్జ్ కందుల సంధ్యారాణి ఆద్వర్యంలో పెద్దేత్తున ధర్న కార్యక్రమం చేపట్టడం జరిగింది
ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ
ఎద్దు ఏడిసిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్ర లో లేదని అన్నారు.చెయ్యి గుర్తుకి ఓటు వేసిన పాపానికి అదే చేత్తో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు
ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ రైతులందరికీ చేస్తాం అని చెప్పి, ఇప్పుడు 13 కొర్రీలు పెట్టీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని, దాదాపు 50లక్షల మంది అర్హులైన రైతులు ఉంటే 20లక్షల మందికి కూడా రుణ మాఫీ చేయలేదన్నారు. దేవుని నెత్తి మీద చెయ్యి పెట్టీ ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తాం అని ఒట్లు వేసి ఇప్పుడు రైతుల కడుపు మీద కొట్టడం జరిగిందనీ గుర్తుచేశారు..
బడ్జెట్ లో ఆర్భాటంగా 31000 కోట్లు పెట్టీ అసలుకు వచ్చేసరికి కొసరు 17000 కోట్లు మాత్రమే మాఫీ చేసాము అని ప్రభుత్వం చెప్తుంది. రైతులు అంటేనే కాంగ్రెస్ కి చిన్నచూపు. రుణమాఫీ లేదు, రైతు బంధు 15000 కాదు కనీసం 10వెలు కూడా అర్హులకు రావట్లేదన్నారు.
రైతు పంట భీమా పధకం ఊసు లేదని, వడ్లకు క్వింటాల్ కి 500 బోనస్ ఇవ్వలేదని ఇలా ప్రతి అంశం లో రైతుని మోసం చేయాలి అని కాంగ్రెస్ కంకణం కట్టుకున్నదని తెలిపారు.
కాంగ్రెస్ కేవలం హైడ్రా పేరు చెప్పి హైదారాబాద్ చుట్టే తిరుగుతుందన్నారు. మరి మిగితా జిల్లాల ప్రజలు అంటే పట్టింపు లేదా? ఇది ప్రజా పాలన కాదు దగా పాలన అని ఎద్దేవా చేసారు.
తక్షణ చర్యలు తీసుకొని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈ నిరసన కార్యక్రమాలు కాస్త ఉద్యమ కార్యాచరణగా రూపుదిద్దుకుంటాయి అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో కందుల సంధ్య రాణీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ, బోడకుంట సుభాష్, కోమల మహేష్, కొండపర్తి సంజీవ్,బీజేపీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, బాణాల స్వామి, కోడూరి రమేష్, గోపగాని నవీన్ గౌడ్, అందే రాజ కుమార్ , బుంగ మహేష్, మామిడి వీరేశం, గుర్రం సురేష్, కన్నూరు భాస్కర్, కుర్ర రాజేందర్, ఈదునూరు చిరంజీవి,పల్లికొండ నర్సింగ్, తడగొండ నర్సయ్య, సిలివేరు అంజి, మాడ ప్రభాకర్ రెడ్డి, బోడకుంట మల్లేష్, బొడ్డు రాజమల్లు, లగిషెట్టి తిరుపతి, కందుల కిషన్, కొల్లూరి లచ్చన్న, రాజేష్ నాయక్, భాగ్య తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App