The yellow card and red card orders issued arbitrarily by the Singareni management should be canceled unconditionally
గుర్తింపు సంఘం ఈ సర్కులర్ పై తన వైఖరిని వెల్లడించాలి
IFTU రాష్ట్ర నాయకుడు తోకల రమేష్ డిమాండ్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి యాజమాన్యం కార్మికుల పైన ఆధిపత్యాన్ని చలాయించేందుకు మరో కుట్ర చేసింది. భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేని విధంగా సింగరేణి యాజమాన్యం ప్రమాదాల విషయంలో ఎల్లో కార్డు, ఎరుపు రంగు కార్డు పేరుతో ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఎల్లో కార్డు ఎరుపు రంగు కార్డుల పేరుతో కార్మికులను వేధించేందుకు, చార్జిషీట్లు, సస్పెండ్ల పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ఈ కుట్ర కోణానికి తెర లేపింది. ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేకమైన సర్కులర్ గా భావిస్తున్నాం.
సింగరేణిలో ప్రమాదాలు జరుగుతున్నాయంటే అది పూర్తిగా సేఫ్టీ డిపార్ట్మెంట్ వైఫల్యం మూలంగానే జరుగుతున్నాయి. ఏ ఒక్క కార్మికుడు కూడా తనంతట తానుగా ప్రమాదానికి గురి కావాలని అధికారుల నిర్లక్ష్యం, ఉత్పత్తి మీద దాహం, కార్మికులపై పనిభార ఒత్తిడి తదితర అనేక విషయాల మూలంగా సింగరేణి ప్రమాదాలు వాటి నుండి తప్పించుకునేందుకు ఇలాంటి సర్కిలర్లను ఎంగవేణి యాజమాన్యం జారీ చేస్తున్నది.సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి మీద ఉన్నటువంటి శ్రద్ధ రక్షణ సూత్రాల అమలుపై లేకపోవడం మూలంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
వాటిని కార్మికులపై తోసే విధంగా ఎల్లో కార్డు ఎరుపు రంగు కార్డుల విధానాన్ని ప్రవేశపెడుతూ సర్కులర్ జారీచేసింది. సింగరేణి గుర్తింపు సంఘం ఇప్పటికైనా ఈ సర్కులర్ పై మాట్లాడాలి. గుర్తింపు సంఘం వైఖరి ఏమిటో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే సింగరేణి యాజమాన్యం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్న నిరంకుశ సర్కులర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే సింగరేణి యాజమాన్యం గత పోరాట చరిత్రను తిరిగి చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App