TRINETHRAM NEWS

The working class should prepare for effective struggles

తెలంగాణలో కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలో IFTU పెద్దపెల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం
పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవటం కోసం, భవిష్యత్ కాలంలో మెరుగైన వేతనాల అమలు కోసం కార్మికులంతా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని IFTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం అన్నారు.IFTU పెద్దపెల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కార్మిక రంగంలో కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ పెరిగిపోయిందన్నారు. ఔట్ సోర్సింగ్ విధానం ఎక్కువై పోయిందని, పాలకులు అన్ని రం గాలను ప్రైవేట్పరం చేయాలని చూస్తున్నారని
భారత కార్మిక సంఘాల సమాఖ్య FTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సూర్యం
విమర్శించారు. పర్మనెంట్ కార్మికులతో సమానం గా పనులు చేయిస్తూ వేతనాలు మాత్రం సమానంగా ఇవ్వటం లేదన్నారు.

సమాన పనికి సమాన వేతనం అందించాలని చట్టం చెబుతున్నా చుట్టబండలు చేస్తున్నారని ఆరోపించారు. హక్కుల కోసం కార్మిక వర్గం అంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలను వెంటనే అమలుకు పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మిక వర్గానికి వేతనాలు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకొని వేతనాల పెంపు దిశగా కార్యాచరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

సింగరేణి లాభాలలో కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచే విధంగా సకాలంలో వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ జీవ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్ ఎఫ్ సి ఎల్లో కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కుల కోసం సమరశీల పోరాటాలే శరణ్యం అన్నారు.


ఈ కార్యక్రమంలో IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్, CPI ML ప్రజాపంధా మాస్ లైన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ , హాయ్ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణరెడ్డి, IFTU జిల్లా నాయకులు ఆడెపు శంకర్ మార్త రాములు, గొల్లపల్లి చంద్రయ్య, గూడూరి వైకుంఠం, ఇనుగాల రాజేశ్వర్ ఎం వాసుదేవరెడ్డి తూళ్ళ శంకర్ , కొయ్యడ శంకర్ , జన్నారపు మధు, కట్ట తేజేశ్వర్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The working class should prepare for effective struggles