TRINETHRAM NEWS

The women’s world is divided over the arrogant words of the CM and Deputy CM

Trinethram News : సీఎం & డిప్యూటీ సీఎం ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన కుత్బుల్లాపూర్ మహిళా నాయకురాల్లు ….

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో బిఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులైన సబితాఇంద్రారెడ్డి గారిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు చేసిన అహంకారపూరిత మాటలను నిరసిస్తూ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ఆదేశాల మేరకు
మహిళలు, బిఆర్ఎస్ పార్టీ నాయకురాల్లు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా మహిళా నాయకురాల్లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి & ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు వారి చిల్లర రాజకీయాల కోసం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని లక్ష్యంగా చేసుకొని మహిళలను నమ్ముకుంటే మోసపోతావ్ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం అన్నారు. నిండు సభలో మహిళలపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలపై స్పీకర్ చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలన్నారు. మహిళలకు ఒంటింటికే పరిమితం కాకూడదని స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్లను అమలు పరిచి రాజకీయాలలో వారిని ప్రోత్సహించిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే, మహిళలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసే బుద్ధి కాంగ్రెస్ నాయకులదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలను కన్నది కూడా ఒక మహిళనే, నీవు కన్నది ఒక మహిళను, అర్ధాంగిగా నీ ఇంటి ఇల్లాలు కూడా ఒక మహిళనే అనే విషయాన్ని మరిచి నిస్సుగ్గుగా మాట్లాడడం సభ్యసమాజాన్ని తల దించుకునేలా చేసింది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు మా నాయకురాలు సబితక్కకు, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. లేదంటే రానున్న రోజుల్లో మిమ్ములను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ రోడ్డుపై తిరగనివ్వం.

ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యురాల్లు, సీనియర్ మహిళా నాయకురాల్లు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The women's world is divided over the arrogant words of the CM and Deputy CM