TRINETHRAM NEWS

ప్రజలను నమ్మించి మెాసం చేసిన సిఎం రెవంత్ రెడ్డి
ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీటిని గోదారిలోకి విడుదల చెయ్యాలి

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలు అమలు చేయకుండా ప్రజలను, రైతులను సిఎం రెవంత్ రెడ్డి మెాసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేసారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. జనగామ గ్రామంలో రైతుల సమస్యలు పరిష్కారం కోసం జనగామ గ్రామ శివారులోని గోదావరి నది ఇసుకలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలసి వారు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులతో మాట్లాడి వారితో భోజనం చేసారు. అనంతరం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ అబద్దపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, ప్రజలను, అన్ని వర్గాల వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు.

ఇటీవలి కాలంలో గోదావరి నది పూర్తి స్థాయిలో ఎడారిగా మారడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేయకపోవడంతో గోదావరి నదిలోకి నీరు రావడం లేదని వెంటనే ఎల్లంపల్లి నుండి నీటిని విడుదల చేయ‍లన్నారు గతంలో గోదావరిలో నీరు ఉన్న సమయంలో రైతులు మోటార్ల ద్వారా నీటిని తీసుకునే వారని స్పష్టం చేసారు. పొలాలు కోతకు వచ్చిన సమయంలో గోదావరిలో చుక్క నీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఈ ప్రభుత్వం ప్రాజెక్టుల రిపేరు పేరుతో నీటిని వదలకుండా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో గోదావరి నది నిండు కుండల ఉన్నాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో గోదావరి నదిలు ఎడారిగా మారుతున్నాయని విమర్శించారు. ఇప్పటికే హైడ్రా పేరుతో ఎంతో మంది పేద ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి వైఖరి వాళ్ళ అన్ని వర్గాల ప్రజలు గోస పడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎవరు అడగని పనులను చేస్తూ దుర్మార్గమైన పాలనా సాగిస్తున్నారని విమర్శించారు. ఎంత సేపు కేసీఆర్ ను బదనాం చేసే విధంగా మాట్లాడటం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదాని తెలిపారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పోరేటర్లు జనగామ కవిత సరోజిని శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణ వేణీ భూమయ్య నాయకులు గోపు అయులయ్య యాదవ్ అచ్చే వేణు తోకల రమేష్ నూతి తిరుపతి బొడ్డు రవీందర్ తోట వేణు ఆడప శ్రీనివాస్ సదానందం సట్టు శ్రీనివాస్ పొలాడి శ్రీనివాస్ రావు వెంకన్న అల్లం అయులయ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App