తేదీ: 28/12/2024.
భయపెడుతున్న బడా నాయకులు – తగ్గేదె లే అంటున్న తహసిల్దారు
చాట్రాయి; (త్రినేత్రం) న్యూస్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, గ్రామంలో మీ భూమి- మీ హక్కు రైతు సభ జరిగింది. ఈ సభలో మండల తహసిల్దారు దాసరి ప్రశాంతి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. భూమి సరిహద్దుల్లో గాని, మీ భూమి మీకు తెలియకుండా బడా నాయకులు ఎవరైనా సరే మీ భూమిని కబ్జా చేసి ఆక్రమించుకున్న ఆన్లైన్లో మీ పేరు లేకుండా వారి పేర్లను పెట్టుకుని సర్వే నంబర్లలో మార్పులు చేర్పులు చేసిన మీరు భయపడవలసిన అవసరం లేదు అన్నారు. ఎవరి భూమి అయితే వాళ్లు హక్కు కలిగి ఉంటారో వాళ్లకు మీ భూమి- మీ హక్కు ద్వారా శాశ్వత పరిష్కారం జరుగుతుంది అని చెప్పారు.
రైతులు వారి వారి సమస్యలను అర్జీల ధ్రువపత్రాలపై రాచి రెవెన్యూ బృందానికి ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ అర్జీలనుపరిశీలించి రెవెన్యూ అధికారులు మరియుఉమ్మడి కూటమి నాయకులు రైతులకుప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని భరోసా ఇవ్వడం జరిగింది. చాట్రాయి మండలంలోని బడా నాయకులు పేదల మరియు ప్రభుత్వ భూమిని సర్వే నంబరు 162/2 గల భూమిని బడా నాయకుల పేరు మీద పట్టా పాస్ పుస్తకం ఇవ్వాలని మండల తహసిల్దారు ను బెదిరిస్తున్నట్టు ఉమ్మడి కూటమి నాయకులు, తహసిల్దారు అనడం జరిగింది.
ప్రభుత్వ భూములో కలిసి ఉన్న పేదల భూమిని పేదలకు చెందేల తగిన చర్యలు తీసుకుంటామని తహసిల్దారు మరియు నాయకులు అన్నారు. మొత్తం ఎకరాలు 30 బడా నాయకులు ఎకరాలు ఏడు. ప్రభుత్వ భూమి మరియు పేదల భూమి ఎన్ని ఎకరాలు అనేది తెలియవలసి ఉంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన, పేదల పక్షాన నిలబడి నా వృత్తినీ నేను కొనసాగిస్తానని అసలు తగ్గేదే లేదని మండల తహసిల్దారు.
దాసరి ప్రశాంతి ప్రజలకు రైతులకు చెప్పారు. ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాన్ని సమకూర్చారు. నూజివీడు డిప్యూటీ వి ఇన్స్పెక్టర్ ఆఫ్ సబ్ కమిషనర్ , జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు తుమ్మల జగన్, అటవీ అధికారి పీ. యస్ దాసు , మండల బిజెపి ఓబిసి నాయకులు ఆదిమూలం నాగ మోహన్ శర్మ, జిల్లా ఓబిసి బిజెపి నాయకులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App