TRINETHRAM NEWS

తెలంగాణ అస్తిత్వ చిహ్నం మన తెలంగాణ తల్లి విగ్రహం
కొత్త తెలంగాణ తల్లి పేరుతో కాంగ్రెస్ కుట్రలు

రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ అస్తిత్వ చిహ్నం మన తెలంగాణ తల్లి విగ్రహం కొత్త తెలంగాణ తల్లి పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నరని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కే.టీ.ఆర్ పిలుపు మేరకు స్దానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసారు. అనంతర ఆయన మాట్లాడుతూ
నిజాం పాలన నుంచి విముక్తి కోసం కమ్యునిస్టులు సాయుధ పోరాటం నడిపిస్తున్న కాలం లో నైజాం పాలకుల సాంస్కృతిక ఆచారాలు తప్ప, తమ సొంత భాష సంస్కృతి వంటి తెలంగాణ ప్రజల అస్థిత్వానికి ఆనాటి రాజరిక పాలనలో అంతగా చోటులేకుండదన్నారు. నాటి మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో భాగమైన ఆంధ్రా ప్రాంతం ప్రత్యేకాంధ్ర కోసం పోరాటాలు నడిపిందని అయితే…అనంతర కాలంలో తెలంగాణను విలీనం చేసుకున్న నాటి ఆంధ్రా నాయకత్వం, ఆంధ్రా మాత’ భావనను వదిలివేసిందని తెలంగాణ తల్లి భావనను విస్మరింపచేసిందని, రెండింటినీ పక్కకు పెట్టి, తెలుగు తల్లి అనే భావనను ముందుకు తీసుకువచ్చరన్నారు.
కుట్రపూరితంగా తెలంగాణ అస్థిత్వాన్ని మరిపించ చూసరని . ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండా’ అంటూ ఆంధ్రా నాయకత్వం మనతో కూడా పాటలు పాడించిందని గుర్తు చేసారు. ఒక ప్రాంత ప్రజల అస్థిత్వానికి చిహ్నంగా వుండాల్సిన తల్లి రూపం దివ్యంగా భవ్యంగా భగవత్ స్వరూపంగా వుండాలె… ప్రజలు చూడగానే చేతులెత్తి నమస్కరించుకునే విధంగా వుండాలె. ఇది మన తెలంగాణసంప్రదాయన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మలి దశ తెలంగాణ ఉద్యమంలో అనివార్యంగా అస్థిత్వభావన ముందుకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ తల్లి రూపానికి అంకురార్పణ జరిగిందన్నారు. కొత్త తెలంగాణ తల్లి పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని
ఈ చారిత్రక నేపథ్యం తెలంగాణ సాంస్కృతిక వారసత్వం గురించిన కనీస సోయిలేని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారన్నారు.
తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రతో తెలంగాణ తల్లిని అవమానించేలా డ్రామా కార్యక్రమం చేపట్టారన్నారు. తెలంగాణ తల్లి వెనుకబడ్డ ప్రాంతానికి గుర్తుగా కళావిహీనంగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును ప్రచారం చేస్తున్నట్లుగా ఉందని తెలంగాణ తల్లి మిగతా అందరు తల్లుల లాగానే సిరిసంపదల ప్రతీకగా ఉండాలే తప్ప పేదగా ఉండకూడదని ఇది తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమే అవుతుందన్నారు.
ఈ ప్రపంచంలో ఆలిని మార్చినోడు ఉండొచ్చు కానీ, అమ్మను మార్చినోడు ఎవడూ ఉండరని, అది ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతున్నదన్నారు.
తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం అనేది, ఇది రేవంత్ ఆలోచననే అనుకోవడానికి లేదు, ఇది కాంగ్రెస్ కుట్ర అన్నారు. ముందు బతుకమ్మ చీరలను తీసేసారు ఇపుడు బతుకమ్మనే తీసేసారు రాను రాను రాష్ట్రాన్ని కూడా తీసేసి విలీనం అంటారు కావొచ్చన్నారు. చెయ్యి గుర్తు కనిపించాలి అనే ఉద్దేశ్యంతో బతుకమ్మను నిమజ్జనం చేశారన్నారు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అధికారం చేతిలో ఉందని ఏకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్నే మారుస్తారా మీరు చెరిపేస్తున్నది కేసీఆర్ గుర్తులు కాదు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలన్నారు.
రాష్ట్ర అధికార చిహ్నంలో చార్మినార్ వద్దన్నారు కాకతీయ కళాతోరణం ఎందుకన్నారు ఇప్పుడు తెలంగాణ తల్లే వద్దంటున్నారు ఇలాగే తెలంగాణ సమాజం ఊరుకుంటే తెలంగాణ రాష్ట్రమే ఎందుకంటారన్నారు.
తెలంగాణ తల్లి చేతులోంచి బతుకమ్మను తీసేసినా కాంగ్రెస్ కు తెలంగాణ గడ్డపై ఇగా బతుకులేదు.
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవంపై కాంగ్రెస్ చేసిన దాడి ఇది,ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలి గాని తల్లి రూపురేఖలు కాదని
ఈ కాంగ్రెస్ తల్లికి ఎప్పటికి తెలంగాణ గల్లిలో స్దానం ఉండదని తెలిపారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించినందుకు
ఈ ముఖ్యమంత్రి కి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పటికి క్షమించరన్నారు. ఈ కార్యక్రమం లో కార్పోరేటర్లు కల్వచర్ల కృష్ణ వేణి అయుత శివకుమార్ కుమ్మరి శ్రీనివాస్ కవిత సరోజిని మాల విజయ రెడ్డి నాయకులు బోడ్డుపల్లి శ్రీనివాస్ చెలకలపల్లి శ్రీనివాస్ మేతుకుదేవరాజ్ నారాయణదాసు మారుతి బోడ్డు రవీందర్ మేడి సదయ్య పిల్లి రమేష్ సట్టు శ్రీనివాస్ ముద్దసాని సంధ్యా రెడ్డి
తోకల రమేష్ ఇరుగురాళ్ల శ్రావన్ కిరన్ జీ బుర్ర వెంకటేష్ ఆవునూరి వెంకటేష్ కర్రావుల రామరాజు వడ్లకొండ మహేందర్ గుర్రం పద్మ మహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App