TRINETHRAM NEWS

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యాశాఖ సంక్షేమ శాఖ మంత్రులు నియమించాలి

రాష్ట్రవ్యాప్తంగా గురుకుల వసతిగృహాలలోని సమస్యలను పరిష్కరించేంతవరకు బిఆర్ఎస్వి గురుకుల బడిబాట పోరుబాట ఆగదు చుక్క శ్రీనివాస్ గురుకుల బడిబాట పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం లోని గోదావరిఖని రామగుండం పట్టణం, పాలకుర్తి మండలం వసతి గృహాలను పెద్దపెల్లి జిల్లా బడిబాట ఇన్చార్జి చుక్క శ్రీనివాస్ , బిఆర్ఎస్వి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజుల శివ పరిశీలించారు. అనంతరం వారుబ మాట్లాడుతూ… రామగుండం నియోజకవర్గం గోదావరిఖని పట్టణంలోని , మార్కండేయ కాలనీలోని ఎస్సీ బాలల వసతి గృహం , పద్మవతి కాలనీలోని ఎస్సీ బాలికల వసతిగృహం , పాలకుర్తి మండలంలోని జయ్యారం గ్రామంలో ఎస్సీ బాలల వసతి గృహం ఈ వసతి గృహాలకు సొంత భవనాలు లేవు , వంట గదులు లేవు వంట సిబ్బంది కూడా సరిపోవడం లేదనీ తరగతి గదులను వంట రూములుగా నిర్వహిస్తున్నారని వంట గదిలో నాణ్యమైన సరుకులు లేవన్నారు. మార్కండేయ కాలనీలోని ఎస్సీ బాలల వసతి గృహంలో బాత్రూములకు డోర్ లు లేవని , వసతిగృహ పరిసరాలు పరిశుభ్రంగా లేవని , కొత్త మెనూ పాటించడం లేదని , చలి తీవ్రత ఉన్నా కూడా బ్లాంకెట్స్ ఇవ్వడం లేదని , కొన్ని హాస్టల్లో వార్డెన్స్ అందుబాటులో ఉండడం లేదన్నారు. రామగుండం పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పరిశీలించడానికి అనుమతించలేదు. పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించడానికి అనుమతించలేదు , కానీ కొంతమంది విద్యార్థులు మమ్మల్ని చూసి కిటికీల నుండి వారి సమస్యలను వివరించారు , సొంత భవనాలు ఉన్నప్పటికీ వసతి గృహ పరిసరాల్లో పాములు తేళ్లు ఇతర విషపురుగులు తిరుగుతున్నాయి , పిల్లలు సాయంత్రం పూట ఆడుకునే సమయంలో ఏ విషపురుగు ఎవరిని కరుస్తుందో అని భయంతో ఆటలు ఆడుకోవడానికి భయపడుతున్నారు , షూలు రాలేదు , బ్లాంకెట్స్ కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు , ఇలా పిల్లలు రకరకాల సమస్యలు చెప్పుకుంటూ బాధపడుతున్నారు , రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని విద్యాశాఖ మంత్రిని , సంక్షేమ శాఖల మంత్రిని నియమించి గురుకుల వసతిగృహాలను రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు వారి వారి పరిధిలో గురుకుల వసతి గృహాలను సందర్శించి అక్కడి సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు ధైర్యం చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిపక్షంలో గురుకులపాట కార్యక్రమం ద్వారా గురుకుల వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించే అంతవరకు కూడా బిఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన పోరాటం చేస్తా ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో రామగుండం పట్టణ సీనియర్ నాయకులు వలియోద్దీన్ , పెద్దపెల్లి జిల్లా టిఆర్ఎస్వి నాయకులు ఉప్పు శివకుమార్ పటేల్ , నాయిని అన్వేష్ , తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App