
దిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు కలకలం రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఐఐటీ దిల్లీలో ఓ విద్యార్థి మృతిచెందాడు. మహారాష్ట్రలోని నాశిక్‌కు చెందిన నెర్కర్ (24) అనే విద్యార్థి ఎంటెక్ చదువుతున్నాడు. క్యాంపస్‌లోని ద్రోణాచార్య వసతిగృహంలో అతడి మృతదేహం శుక్రవారం వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులు గురువారం రాత్రి ఫోన్ చేయగా నెర్కర్ స్పందించలేదు. అనుమానం వచ్చి వారు అతని మిత్రులకు సమాచారం ఇచ్చారు. వారు అతని గది దగ్గరకు వెళ్లి చూడగా.. లోపలి నుంచి గడియ పెట్టినట్లు గుర్తించారు. వెంటనే వసతిగృహ గార్డ్‌కు సమాచారమిచ్చారు. తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లగా అతడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. తల్లిదండ్రులకు సమాచారం అందించి.. మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు…
