TRINETHRAM NEWS

గోదావరిఖని ఆరో డివిజన్ సప్తగిరి కాలనీలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో

స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి దాదాపు 5 లక్షల రూపాయలతో రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది

రోడ్డు పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి కార్పొరేటర్ ఎండి ముస్తఫా బీసీ విభాగం అధ్యక్షులు రమేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జూలకటకదారులు హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు
అనంతరం కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
డివిజన్ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను శాలువాతో సన్మానించారు..

ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో డివిజన్లో అస్తవ్యస్తమైన రోడ్డు ను మరమతులకు చేయడానికి వారి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దాదాపుగా 5 లక్షల రూపాయలతో ఈరోజు పనులను ప్రారంభించడం జరిగిందని,
డివిజన్ ప్రజల పక్షాన మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పక్షాన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని,
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధికారం చేపట్టిన 8నెలల్లోనే రామగుండం పూర్వవైభవం కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అందులో భాగంగా రామగుండంలో సింగరేణి, జెన్కో సంస్థలు సంయుక్తంగా 800మెగా వాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, మేడిపల్లి ఓసీపీలో 500మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారని, తిలక్ నగర్ నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటరును ప్రారంభించి మొదటి బ్యాచ్ లో దాదాపుగా 150మందిని ట్రైనింగుకు పంపించారని,
రామగుండం అభివృద్ధికై దాదాపుగా 400కోట్ల రూపాయలు తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని,
అదేవిధంగా డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి నిజాయితీతో, చిత్తశుద్ధితో, నిస్వార్థంగా కృషి చేస్తున్నానని, అతి త్వరలో మరిన్ని అభివృద్ది పనులు ప్రారంభం అవుతాయని,
తప్పకుండా డివిజన్ ప్రజల ఆకాంక్షకనుగుణంగా, సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, 6వ డివిజన్ నాయకులు శీలం సదానందం, రమణ, రాజయ్య, గట్టయ్య, గుంపుల శ్రీధర్, సలిగంటి ఓదెలు, గోవర్ధన శాస్త్రి, మహిళ అధ్యక్షురాలు మాల్క అర్చన, ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App