పోరాడితేనే కార్మికుల సమస్యలు పరిష్కారం సింగరేణి కార్మికోద్యమ చరిత్ర సత్యం సిఐటియు,
రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు ఉదయం ఏడు గంటలకు జీడికే -1&3 ఇంక్లైన్ పిట్ కార్యదర్శి దాసరి సురేష్ అధ్యక్షతన ద్వారా సమావేశం జరిగింది, ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి చరిత్రలో పోరాటం చేయకుండా ఏ హక్కు రాలేదని పోరాటం తోటే అనేక హక్కులు సాధించబడ్డాయని ఈరోజు కొంతమంది చేస్తున్న గ్లోబల్ ప్రచారం పోరాట చరిత్రకు విరుద్ధంగా ఉందన్నారు, మేం పోరాడితేనే హక్కులు వచ్చాయని చెప్తున్న గుర్తింపు సంఘ నాయకులు ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలుపై ఎందుకు పోరాటం చేయడం లేదని విమర్శించారు, పైగా సిఐటియు పోరాటం చేస్తే వస్తుందా అని చెప్తున్నా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఎన్నికల సమయంలో మేము గెలిస్తే సొంతింటి పథకం అమలు చేస్తామని కార్మికులకు చెప్పిన విషయం నిజం కాదా, అంటే కార్మిక సమస్యలు మీకు పట్టింపు లేదా రాజకీయ నాయకుల లెక్క ఓట్ల రాజకీయం చేయడమే విధానమా అని హెచ్చరించారు, సింగరేణి కార్మికుల సమస్యలపై నిత్యం పోరాటం చేయడమే సిఐటియు లక్ష్యం సింగరేణి కార్మికులకు సొంతిల్లు సాధించేవరకు పోరాటం ఆపేది లేదని,
ఈ పోరాటంలో కార్మికులందరూ కలిసి వస్తున్నారు కార్మిక సంఘాలుగా మీరు కూడా మాతోటే కలిసి రండి సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కార్మికులకు సొంతింటి పథకం అమలు వాగ్దానం నిలబెట్టుకోవాలంటే అసెంబ్లీలో కోల్ బెల్ట్ ఎంఎల్ఏ లు సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేస్తాను అని తీర్మానం చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు, అనంతరం గని మేనేజర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు, కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య, అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరి రావు, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, ఏ శంకరన్న, దాసరి సురేష్, ఈదుల సాగర్, పెద్దపల్లి శశికిరణ్, శ్రావణ్ కుమార్, నీలి రాజయ్య, జనార్ధన్, ప్రవీణ్ కుమార్, జి జనార్దన్ రెడ్డి, కొమురయ్య, సందీప్, రామకృష్ణ రెడ్డి, నగేష్, బి రాజు, పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App