The bubble jungle colony is a bed of snakes and the people of the colony are living with their lives in the palm of their hands
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అంతర్గాంలో సోమవారం వేకువ జామున అంతర్గాం మండలంలోని సుభాష్ నగర్ మెయిన్ రోడ్డు ప్రక్కన రాయదండి పంచాయతీ పరిధిలోని బుడగ జంగాల కాలనీ ప్రజలు పెద్ద చెరువును ఆనుకొని మత్తడి ప్రక్కన నివాసం ఏర్పరచుకొని గత కొంతకాలంగా జీవిస్తున్న సందర్భంలో చెరువు పరిపాహక ప్రాంతంలో కొండ చిలువల తో పాటు నాగుపాములు తదితర పాములు సంచరిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా 15అడుగుల భారీ కొండచిలువ బుడగ జంగాలకు సంబంధించిన కోడి పిల్లలను తరచుగా తినటం జరుగుతున్నది. ఇది గమనించిన స్థానిక కాలనీ ప్రజలు పలుమార్లు జాగ్రత్త పడడం జరిగినది.
కానీ ఈ రోజు తెల్లవారుజామున సంవత్సరకాలం చిన్న పాప ఆడుకుంటుండగా పాప దగ్గరికి వచ్చిన కొండచిలువ చిన్న పాపను మింగే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో స్థానిక బుడగజంగాలు ఆ పాము భారి నుండి చిన్న పాపను కాపాడి ఆ పాముని చెట్లల్లోకి వదిలి వేయడం జరిగినది. అలాగే కాలనీవాసులు మాట్లాడుతూ మాకు ఎక్కడ నివాసయోగ్యం లేక ఇక్కడ గత కొంతకాలంగా నివాసం ఉంటున్నాము. కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి మా పరిస్థితిని అర్థం చేసుకొని నివాసయోగ్యానికి అనుకూలమైన ప్రదేశమైనా నివాసయోగ్యమైన ఏర్పాటు చేస్తే మేము అక్కడికి తరలి వెళ్తామని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగినది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App