The opposition leaders are making a living by spreading lies about the farmer loan waiver
పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కాల్వ శ్రీరాంపూర్ కేంద్రంలోని కే.జి.ఎన్ ఫంక్షన్ హల్లో మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందగా వారికి అయినటువంటి ఖర్చులకు సిఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి రూ.38,47,000/- లక్షల విలువ గల 148 సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులను మరియు రూ.17,00,272/- లక్షల విలువ గల 17 కళ్యాణ లక్ష్మీ చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ముందుగా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వచ్ఛదనం పచ్చదనం మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ
ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ ప్రకటించారని ఎన్నికల హామీ కట్టుబడి ఉండి రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారని అన్నారు
ఇప్పటికే లక్ష 50 వేల లోపు రైతులకు రుణమాఫీ జరిగిందని ఆగస్టు 15న సాయంత్రం లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని అన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ ని చూసి బిఆర్ఎస్ నేతలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారన్నారు.
బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లో ఉన్నప్పుడు రుణమాఫీ ఎక్కడ జరిగిందో బిఆర్ఎస్ నేతలు చూపెట్టాలన్నారు
వచ్చే ఖరీఫ్ సీజన్లో సన్న వడ్లు వేసుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 500 బోనస్ చెల్లిస్తుందని అన్నారు
ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల వారిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు
పత్తిపాక రిజర్వాయర్ కోసం సర్వే జరుగుతుందని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రిజర్వాయర్ నిర్మాణం కోసం నిధులు కేటాయించి పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి చివరివాయకట్టైనా కాల్వ శ్రీరాంపూర్ ఓదెల, మంథని ,పెద్దపల్లి మండలాలకు సాగునీరు అందిస్తాం
ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించాలని వారు కోరారు
ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App