Trinethram News : రాజమహేంద్రవరం, తేది.10.2.2024
రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్ బియ్యం అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవ్వరైనా పి.డి.ఎస్బియ్యం కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రీజనల్ విజిలెన్స్ ఎస్.పి. కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి అన్నారు.
శనివారం తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం మండలంలోని శ్రీరామ్ నగర్ గ్రామ సమీపములో అశోక్ లేలాండ్ ఎకోమెట్ స్టార్ వాహనం నంబర్ AP39 UE 9333లో పి.డి.ఎస్రేషన్ బియ్యంతో వెళ్ళుతుంది అన్న సమాచారముతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు వాహనంను అదుపులోకి తీసుకోవడం జరిగింది.తనిఖీ చేయగా, సదరు వాహనం నందు 122 ప్లాస్టిక్ బస్తాలలో సుమారు 6100 కేజీల పి.డి.ఎస్ బియ్యంను గుర్తించటమైనది. సదరు వాహన యజమాని వెలుగుల కృష్ణ మరియు అతని భాగస్వామి వెలుగుల గురయ్య @ బాబ్జి, R/o B.ప్రత్తిపాడు ఆదేశాల మేరకు PDS బియ్యాన్ని ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామం నుండి గొల్లప్రోలు మండలం బి