TRINETHRAM NEWS

దేశవ్యాప్త కార్మిక సంఘ నిర్మాణం కోసమే TUCI లో IFTU విలీనం.

బలమైన విప్లవోద్యమ నిర్మాణము కోసం కార్మిక వర్గం ఐక్యం కావాలి.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జాతీయోద్యమ కాలంలో 1922లో ఏఐటీయూసీ ఏర్పడింది. 1947లో ఐఎన్టిఈసి ఏర్పడింది. 1967 దాకా ఏఐటీయూసీ వారసత్వాన్ని కొనసాగించాం. రాజకీయ లక్ష్యం దేశ స్వభావం అవగాహనలో వచ్చిన మార్పులతో 1978లో ఐఎఫ్టియు సంస్థ ఏర్పడింది. నాటి నుండి నేటి వరకు ఐఎఫ్టియు అనుబంధంగా వివిధ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం. 26 రంగాల కార్మిక చట్టబద్ధ యూనియన్లను అనుబంధం చేశాం. లక్షమంది కార్మికులకు సభ్యత్వాన్ని ఇచ్చాం. ఒక బలమైన కార్మిక ఉద్యమాన్ని బీడీ భవనా ఆటోమోటివ్ కేజీబీవీ హమాలీ మిల్ గోదాం వర్కర్స్ గ్రామపంచాయతీ సింగరేణి తదితర రంగాలలో నిర్మించే కృషి కూడా కొనసాగుతున్నది.
అయితే ఐ ఎఫ్ టి యు ఏర్పాటు నాటి దేశ స్వభావం రాజకీయ దృక్పథం పై అంతర్గతంగా చర్చ సాగుతున్నది. మారుతున్న కాలమాన పరిస్థితులను అన్వయించుకోవడం ద్వారా పెట్టుబడిదారీ వర్గాల దోపిడీపై పోరాడాల్సి ఉన్నది. శాస్త్రీయమైన రాజకీయ లక్ష్యాలను ఏర్పరుచుకోవలసి ఉన్నది. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అనుబంధంగా ఐఎఫ్టియుగా ఉన్న నిర్మాణాలను ప్రటిష్టపరుస్తూ విస్తరిస్తూ కొనసాగుతున్నాం. ఈ క్రమంలో దేశంలో కార్మిక వర్గంపై ప్రభుత్వాల అణిచివేత దోపిడీ పెరుగుతున్నది. కార్మిక వ్యతిరేక విధానాలు తీవ్రంగా ముందుకు వచ్చాయి ఆర్థిక దోపిడీఏ కాకుండా మత ఉన్మాద దృక్పథంతో పాసిస్తూ విధానాలతో మోడీ ప్రభుత్వం ముందుకు వస్తున్నది.

కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నది. కార్మిక వర్గ ఐక్యతకు సమిష్టి ఉద్యమానికి దేశవ్యాప్త సంఘ నిర్మాణానికి ఐ ఎఫ్ టి యు పరితపించింది. నిర్దేశించుకున్న లక్ష్యాలతో కొనసాగే దేశవ్యాప్త కార్మిక సంఘం కోసం అన్వేషించింది. తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ బెంగాల్ బీహార్ ఢిల్లీ పంజాబ్ తదితర 14 రాష్ట్రాలలో సంఘటిత రంగాలలో పనిచేస్తున్న టి యు సి ఐ, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా మన దృష్టికి వచ్చింది. దేశవ్యాప్త నిర్మాణానికి ఐఎఫ్టియును టీయూసీఐలో విలీనం చేయాలని ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు తీర్మానించారు.

దానిలో భాగంగానే అక్టోబర్ 20వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీన సభను ఏర్పాటు చేశాం. సభకు హాజరైన అన్ని జిల్లాల ప్రజలకు కార్మికులకు విప్లవ అభినందనలు తెలుపుతున్నాము మోడీ తీసుకువచ్చిన నాలుగు లేబల్ కోడ్లు రద్దుకై సమాన పనికి సమాన వేతనం కనీస వేతనాల జీవో సవరణకై రాబోయే పాసిస్తూ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన బాధ్యత అన్ని కార్మిక సంఘాలపై కార్మిక వర్గంపై ఉందని ఆ దిశగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App