Trinethram News : న్యూఢిల్లీ
దంత వైద్య విద్యలో పీజీ కోర్సు అయిన ఎండీఎస్‌లో ప్రవేశానికి నిర్వహించే నీట్-ఎండీఎస్ 2024 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ విండోను తిరిగి తెరిచినట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30లోగా ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయడంతో పాటు సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఏడాది మార్చి 9 నుంచి 11 లోగా తమ దరఖాస్తులను పంపవచ్చు.
నీట్-ఎండీఎస్ 2024 పరీక్ష ఈ నెల 18న జరుగుతుంది. అడ్మిట్ కార్డులను 15న జారీ చేస్తారు. ఫలితాలను ఈ ఏడాది ఏప్రిల్ 18న ప్రకటిస్తారు.