TRINETHRAM NEWS

Trinethram News : మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

సంక్రాంతి పండుగ రోజున ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కల్పించారు.

👉నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన జ‌రిగిన‌ చిక్కేపల్లి మల్లేష్ హ‌త్య‌ను కేటీఆర్ రాజ‌కీయంగా వాడుకోవాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

👉కుటుంబ, భూ త‌గాదాలే మ‌ల్లేష్ హత్య‌కు కార‌ణం. అయితే దీన్ని రాజ‌కీయ హ‌త్య‌గా చిత్రిక‌రించే కుట్ర‌ల‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.

👉బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌ల్లేష్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తే మాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు. మ‌ల్లేష్ హ‌త్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

👉మ‌ల్లేష్ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాం. మ‌ల్లేష్ కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది.

👉20 సంవ‌త్స‌రాల‌కు పైగా ఉన్న నా రాజ‌కీయ జీవితంలో ఏనాడు హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదు.

👉ఏడో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని నేను. నేనేంటో ప్ర‌జ‌ల‌కు తెలుసు.

👉ప‌రామ‌ర్శ‌కు వ‌చ్చే ముందుకు సమాచారం ఇచ్చిన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే గుణగణాల గురించి కేటీఆర్ తెలుసుకోవాల్సింది.

🔥మాజీ ఎమ్మెల్యే చెబితే ఏది పడితే అది మాట్లాడితే ఎలా?

👉ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అన్న‌ట్లు బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.

👉కేటీఆర్ త‌న‌ స్థాయి మరచి మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.

👉నిందారోపణలు చేసి హత్యను రాజకీయాలకు వాడుకోవటం కేటీఆర్ లాంటి వారికి తగ‌దు.

👉ఆరోపణలు చేసే ముందు మీ మనస్సాక్షిని అడగండి.

👉ఈ కేసులో ఇప్ప‌టికే పోలీసులు నిందితుల‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేశారు…

👉దీన్ని రాజకీయంగా వాడుకోవాలని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు.

👉హ‌త్య‌కు గురైన‌ మల్లేష్…. బీజేపీ సానుభూతి పరునిగా ఉండి ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ లో చేరాడు.

👉అగ్గిరాజేసి, బుర‌ద‌జ‌ల్లి, ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించే విధంగా ప్ర‌వ‌ర్తించ‌డం మంచిది కాదు.

ఇటువంటివి మంచిది కాదని హెచ్చరిస్తున్నా.

👉రాజ‌కీయ క‌క్ష్య సాధింపులు బీఆర్ఎస్ కు అల‌వాటు. అందుకే ప్ర‌జ‌లు వారిని ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెట్టారు.

👉బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హాయంలో జ‌రిగిన ప్ర‌జాధ‌నం దుర్వినియోగం, ప్ర‌భుత్వ పైళ్ల మాయం, ధాన్యం కొనుగోళ్ళ‌లో అక్ర‌మాలు, ఇసుక మాఫియా ఇలా అన్నింటిపై విచార‌ణ జ‌రిపిస్తాం.

👉పైసా పైసా లెక్క తేల్చి ప్ర‌భుత్వ ఖజానాలో జ‌మా చేస్తాం.

👉బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక హత్యలు జరిగాయి. గత పదేళ్ల కాలంలో ఏం జరిగిందో ప్రజలలకు తెలుసు..

👉మంథ‌నికి చెందిన అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య, మధుకర్ అనే యువకుడి పరువు హత్య, ఆర్మూర్ లో తలారి సత్యం అనుమాన‌స్ప‌దం మ‌ర‌ణం ఇలా ఎన్నో ఘ‌ట‌న‌లు బీఆర్ఎస్ హ‌యంలోనే జ‌రిగాయి.

దొంగలను వెనుకకు వేసుకుని వచ్చింది గత ప్రభుత్వం కాదా

👉కొండగ‌ట్టు బ‌స్సు ప్ర‌మాద బాధితుల‌ను కానీ హ‌త్య‌కు గురైన బాధిత‌ కుటుంబాల‌ను మీరు ఏనాడైన ప‌రామ‌ర్శించారా.

👉అందుకే కదా.. ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని ఓడించారు.

👉కాంగ్రెస్ పాల‌న‌లో రాజ‌కీయ క‌క్ష్య‌పూరిత‌మైన కేసులు, అరెస్ట్ లు ఉండ‌వు.

👉ఇక‌నైనా మీ ప్ర‌తిష్ట‌, మీ పార్టీ ప్ర‌తిష్ట‌ను ఇంకా దిగ‌జార్చుకోవ‌ద్ద‌ని హిత‌వు ప‌లుకుతున్నాను.

హ‌త్య‌కు దారితీసిన పరిస్థితులు

👉హ‌త్య‌కు గురైన మ‌ల్లేష్ , నిందితుడు న‌రేష్ కు మ‌ధ్య స‌మీప బందుత్వం ఉంది. అయితే స‌ర్వే నంబ‌ర్ 499 లో వీరిద్ద‌రికీ చెరో అర ఎక‌రం భూమి ఉండేది. అయితే మ‌ల్లేష్ ఆ అర ఎక‌రాన్ని కూడా త‌న పేరు మీద‌కు మార్చ‌కుని, మొత్తం ఎక‌రం భూమిని ధ‌ర‌ణిలో రిజిస్ట్రేష‌న్ చేసుకున్నాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గ‌త కొన్ని రోజులుల‌గా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌రేష్ ,,, మ‌ల్లేష్ ను హ‌త్య చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌ల్లేష్ ను హ‌త్య చేసేందుకు స‌హ‌క‌రించార‌నే ఆరోప‌ణ‌ల‌పై అరెస్టైన సాతాపూర్ కు చెందిన జాల‌ మ‌ల్లేష్ బీఆర్ఎస్ కార్య‌క‌ర్త కావ‌డం గ‌మ‌నార్హం.

👉అయితే ధ‌ర‌ణిలో త‌న పేరు మీద ఎక‌రం భూమి రిజిస్ట్ర‌ర్ కావ‌డం, ఆ త‌ర్వాత హ‌త్య‌కు గురైన మ‌ల్లేష్ ఎన్నిక‌ల‌కు ముందు గ‌తేడాది న‌వంబ‌ర్ 22 న మాజీ ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రెడ్డి స‌మక్షంలో బీఆర్ఎస్ లో చేర‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. బీజేపీ సానుభూతిప‌రునిగా ఉన్న మ‌ల్లేష్… ధ‌ర‌ణిలో త‌న పేరు మీద భూమి రిజిస్ట్రేష‌న్ చేసినందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.