TRINETHRAM NEWS

Trinethram News : 6th Jan 2024 :

తమిళనాడులో మొదలైన జల్లికట్టు సందడి

తమిళనాడులో పండగ పూట జల్లికట్టు సందడి కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో యువకులు ఈ సాంప్రదాయ క్రీడలో ఉత్సాహంతో పోటీపడుతున్నారు. ఇవాళ మదురై, తిరుచ్చి జిల్లాల్లో పోటీలు ప్రారంభించారు.

పాలమేడు జల్లికట్టులో 700 ఎద్దులు 300 మంది యువకులు అలాగే తిరుచ్చి జల్లికట్టులో 500 ఎద్దులు 300 యువకులు ఎద్దులును అదుపు చేయడానికి పోటీ పడ్డారు.

వేల సంఖ్యలో ప్రజలు ఈ జల్లికట్టు ఆటను చూడటానికి గుమిగూడారు.