Trinethram News : హైదరాబాద్
ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరో గ్యారంటీ అమలుపై కసరత్తు చేస్తున్నారు..
మార్చి 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇల్లు లేని అర్హులందరికీ పథకం వర్తింపజేయాలని, అందుకు అనుగుణంగా వెంటనే విధివిధానాలను తయారు చేయాలని సూచించారు.
ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. అందుకు సంబంధించిన నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సీఎంతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో ఉన్నారు.