TRINETHRAM NEWS

ఆదివాసి చట్టాలను,ధిక్కరించి కేటాయించిన హైడ్రో పవర్ ప్రాజెక్టును రద్దు చేయాలి. – సిపిఎం పార్టీ

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, అల్లూరిజిల్లా, ( జిల్లా ఇంచార్జ్ ): ఆదివాసీ చట్టాలను ధిక్కరించి కేటాయించిన హైడ్రో పవర్ ప్రాజెక్టును రద్దు చేయాలి. 1/70 చట్టాన్ని సవరించాలనే వాక్యాలను బలపరుస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం, ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

అనంతగిరి మండలం లో హైడ్రో పవర్ ప్రాజెక్టును నవయుగ కంపెనీకి అప్పగిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదాని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తోందని, పార్టీ జిల్లా కార్యదర్శి పి. అప్పల నరస ప్రకటించారు.

పాడేరు సి.పి.ఎం కార్యాలయం లో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కిల్లో మొస్య, ఎస్.సుందరావు, కె.రామరావు తో కలిసి పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పల నరస విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

పార్టీ జిల్లా కార్యదర్శి పి. అప్పల నరస మాట్లాడుతూ, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రవేట్ కంపెనీలకు సహజ వనరులు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధం. అనంతగిరి మండలం నిమలపాడు మైనింగ్ లీజును రద్దు చేయాలని, సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్ లో తీర్పు ఇస్తూ ప్రభుత్వానికి, షెడ్యూల్డు ఏరియాలో లీజ్ కి ఇచ్చే అధికారం లేదని, నాటి మైనింగ్ ఒప్పదంని రద్దు చేసింది.నాడు కూడ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వమే. సుప్రీం కోర్టు తీర్పు లను కూడా గౌరవించకుండ అడ్డగోలుగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లొంగి ప్రవేట్ సంస్థలకు ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులను అప్పగించడం అన్యాయం.

ఇప్పటికీ1/70 చట్టాన్ని సవరించాలని స్పీకర్ అయ్యన పాత్రుడు వాక్యాలను రాష్ట్ర ప్రభుత్వం బలపరుస్తూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను ప్రవేట్ సంస్థలకు కేటాయించడం దారుణం. పిసా చట్టాన్ని దిక్కరించడం సరికాదు.గ్రామ సభ అభిప్రాయాలను కూడా తీసుకోలేదు. గిరిజన సలహా మండలి (టి. ఏ.సి ) ఆమోదం కూడా లేదు. గత ప్రభుత్వ వైఖరికి, నేటి ప్రభుత్వం వైఖరికి ఏమి తేడా లేదని ఆదివాసీ సంపదను దోచిపెట్టడమే లక్ష్యంగా పాలన ఉందని అన్నారు.ఆదివాసీ వ్యతిరేక విధానాలపై తీవ్రమైన పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం.
షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీ చట్టాలను,హక్కులను ప్రభుత్వం ఉల్లగిస్తున్న తీరుపై రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App