TRINETHRAM NEWS

Trinethram News : విజయనగరం జిల్లా : జనవరి 17
విజయనగరం జిల్లాలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది.

భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం,కావడి తో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరినీ కలిచివేస్తుంది.

ఎస్ కోట మండలం చిట్టెంపాడుకి చెందిన మాదల గంగన్న, గంగమ్మ లకు ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. అకస్మాత్తుగా వారి కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు.

దీంతో చికిత్స నిమిత్తం స్వగ్రామం చిట్టెంపాడు గిరిశిఖర గ్రామం నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు రహదారి సౌకర్యం లేకపోవడంతో అతి కష్టం మీద కుమారు డిని డోలిలో క్రిందకి చేర్చి అక్కడ నుండి విశాఖ ఆస్పత్రికి తరలించారు.

అయితే గంగన్న కుమా రుడు చికిత్స పొందుతూనే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి లోనే మృతి చెందాడు. కుమారుడు మృతి విషయం తెలుసుకున్న తల్లి గంగమ్మ తీవ్ర మనస్థాపానికి గురై ఆమె కూడా అనారో గ్యానికి గురైంది.

దీంతో వెంటనే గంగన్న తన భార్యను తీసుకొని కావడి సహాయంతోనే చిట్టెంపాడు నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు చేర్చి అక్కడ నుండి విశాఖ ఆసుపత్రికి తరలించారు.

గంగమ్మ కూడా చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మరణించింది. వారం రోజుల వ్యవధిలో భార్యతో పాటు ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందటంతో కన్నీరు మున్నీరుగా రోదించాడు.గంగన్న. ఇక చేసేదిలేక గంగమ్మ మృతదేహాన్ని విశాఖ ప్రైవేట్ ఆస్పత్రి నుండి స్వగ్రామానికి తరలిం చేందుకు సిద్ధమయ్యాడు.

అందుకోసం ఎస్ కోట వరకు ఆటోలో తీసుకెళ్ళాడు. అలా మృతదేహాన్ని ఎస్ కోటలో దించి అక్కడ నుండి ఆటో డ్రైవర్ వెనుతిరిగాడు. అయితే ఎస్ కోట నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు మరో ఆటోలో తరలించేందుకు గంగన్న వద్ద డబ్బులు లేవు. దీంతో స్నేహితుడి బైక్ పైనే కూర్చోబెట్టి నానా అవస్థలు పడుతూ కొండ దిగువన ఉన్న దబ్బగుంటకి మృతదేహాన్ని తరలిం చాడు.

అనంతరం అక్కడ నుండి కొండ మీద ఉన్న తన స్వగ్రామమైన చిట్టెంపాడుకి కావడి సహాయంతోనే సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర రాళ్లు రప్పల మధ్య అనేక అగచాట్లు పడి భార్య గంగమ్మ మృతదేహాన్ని ఇంటికి తరలించాడు.

గంగన్న కష్టాన్ని చూసిన స్థానికులకు ఏడుపు ఆగలేదు. గంగన్న భార్య మృతదేహాన్ని బైక్ పై తరలిస్తుంటే స్థానికులం దరూ ప్రేక్షక పాత్ర పోషించా రే తప్పా ఏ ఒక్కరూ మాన వత్వంతో సహాయం చేసేం దుకు ముందుకు రాలేదు..