The government should take action against the contractors who are involved in harassment and physical attacks
తోటి కాంట్రాక్టర్ల వేధింపుల వల్ల మృతి చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాస రెడ్డి కి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.
వేదింపులకు, భౌతిక దాడులకు పాల్పడిన కాంట్రాక్టర్ లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
తోటి కాంట్రాక్టర్ శ్రీనివాస రెడ్డి మృతి కి కారకులైన కాంట్రాక్టర్ లను సింగరేణి బ్లాక్ లిస్టులో పెట్టాలి.
ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ డిమాండ్.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి లో ఆన్ లైన్ టెండర్ ద్వారా వచ్చిన పనులను గోదావరిఖని కి శ్రీనివాస్ రెడ్డి అనే సింగరేణి కాంట్రాక్టర్ శ్రీరాంపూర్ లో పనులు చేస్తుండగా శ్రీరాంపూర్ కు చెందిన తోటి కాంట్రాక్టర్ లు పనులను అడ్డుకుంటూ భౌతికదాడులకు పాల్పడుతూ వేదింపులకు గురి చేయడం వల్ల గోదావరిఖని కి చెందిన కొలిపాక శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టర్ మృతి చెందాడని, అతని మరణానికి కారకులైన శ్రీరాంపూర్ కు చెందిన సింగరేణి కాంట్రాక్టర్ లపై, మరియు స్థానిక సింగరేణి అధికారుల పై సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని, అతని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ను సింగరేణి నుంచి మరియు కాంట్రాక్టర్ ల నుండి ఇప్పించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినెష్ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
గోదావరిఖని కి చెందిన శ్రీనివాస్ రెడ్డి బ్రతుకు తెరువు కోసం సింగరేణి లో కాంట్రాక్టు గా నమోదై పలు పనులను ఆన్ లైన్ టెండర్ ద్వారా దక్కించుకొని నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని ఆయన పేర్కొన్నారు. శ్రీరాంపూర్ లో పనులు చేస్తుండగా శ్రీరాంపూర్ కు చెందిన తోటి కాంట్రాక్టర్ లు శ్రీనివాస్ రెడ్డి ని ఇక్కడ పనులు ఎట్లా చేస్తావని, ఇది మాకు సంబంధించిన ఏరియా అంటూ పనులను అడ్డుకుంటూ భౌతికదాడులకు, పని ముట్లను గుంజుకుని వేదింపులకు గురి చేయడం వల్ల అతను మానసిక ఒత్తిడికి గురయ్యి మృతి చెందాడని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించి శ్రీనివాస రెడ్డి ని వేదింపులకు గురి చేసిన శ్రీరాంపూర్ కాంట్రాక్టర్ లపై, మరియు పట్టించుకోని సింగరేణి అధికారుల పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం వారిని బ్లాక్ లిస్టులో పెట్టి అతని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా భవిష్యత్తులో సింగరేణి లో ఇలాంటి దాడులు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తోటి కాంట్రాక్టర్ ల అభివృద్ధి పనులను అడ్డుకుంటూ భౌతికదాడులకు పాల్పడుతూ వేదింపులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్ లపై రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు లేనిచో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App