త్రినేత్రం న్యూస్ గొల్లపల్లి మండలం
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను, ఎస్సీ వర్గీకరణ ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్
ఆమరుల బలిదానాల పునాదుల మీద సిద్దించిన తెలంగాణలో గత పాలకులు ఉద్యమకారులకు అన్యాయం చేశారని అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చాలని, ఎస్సీ కులాల న్యాయ బద్దమైన వర్గీకరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ యవజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ కోరారు.
సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఈనెల 29న తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం అధ్యక్షతన హైదరాబాద్ ఇందిరాపార్కులో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల సభను విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా నాయకులతో కలిసి పేట భాస్కర్ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయ్యాలని, ప్రజాపాలనలో ప్రకటించిన రెండు వందల ఐబై గజాల స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయాలనే లక్ష్యంతో సభ ఏర్పాటు చేశామని ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయలని కోరారు. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేస్తామన్నారని ఇకనైనా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని పేట భాస్కర్ స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో టిపిఎస్ జేఏసీ, టిఎవైఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోనగిరి మల్లారెడ్డి, కొంగర పవన్, అధికార ప్రతినిధి దుమాల రాజ్ కుమార్, రైతు విబాగం జిల్లా అధ్యక్షులు ఎలిశేట్టి గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జెల రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు షాహేద్ మహ్మద్ షేక్,జగిత్యాల పట్టణ అధ్యక్షులు ఎనుగంటి మోహన్, కోరుట్ల అధ్యక్షులు శనిగారపు రాజేష్, బీమారం మండల అధ్యక్షులు బంగారు దీపక్, మేడిపల్లి మండల ఇంచార్జీ చిట్యాల రాజేష్ నాయకులు దుమాల గంగారాం, జంపాని శ్రీనివాస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App