The girl’s family should be given a government job along with 50 lakhs gratuity
పెద్దపల్లిలో జరిగిన ఘటనపై
ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి.
బాలిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఘటన పైన జిల్లా కలెక్టర్ ఆర్ డి ఓ గారిని కలిసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని పిఓడబ్ల్యు మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగింది అలాగే రైస్ మిల్లు యాజమాన్యాలతో అక్కడున్న అనేక విషయాలను చర్చ చేయడం జరిగింది.
ఇదంతా పరిశీలించిగా పోలీస్ సిబ్బంది
రైస్ మిల్లులలో తక్కువ వేతనాలకు ఇతర రాష్ట్రాల్లో ఉండే కార్మికులను తీసుకొచ్చి ఇలాంటి నిబంధనలు పాటించకుండా పరిచయం చేసుకుంటున్నా యాజమాన్యాలు అక్కడ ఏం జరిగినా పట్టించుకోని అధికారులు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది అయినా కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు.
గత సంవత్సరం ఇటిక బట్టీలలో బాలిక పైన ఇదే రకమైన దుశ్చర్య జరిగింది అయినా అధికారులు పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో నేరస్థులకు భయం లేకుండా పోతుంది.
ఇతర రాష్ట్రం నుండి కార్మికులను తీసుకువచ్చినప్పుడు వారికి సంబంధించిన వివరాలు సంబంధించిన అధికారుల వద్ద పోలీస్ సిబ్బంది వద్ద లేకపోవడం కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. యాజమాన్యాల పైన నిందితులపైన వెంటనే కేసు పెట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
నిందితుడిని బహిరంగ శిక్షించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని రైస్ మిల్లు యాజమాన్యాల పైన కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపెల్లి జిల్లాలో బాలికపై అత్యాచార ఘటనపై ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి వెంటనే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని సత్వర న్యాయం అందే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నది.
బాలిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఈ వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో POW రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు మార్త రాద, కోడిపుంజుల సప్న , సునీత సత్తెక్క తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App