TRINETHRAM NEWS

The Eluru District Police, who played fake currency gang games

Trinethram News : ఏలూరు జిల్లా
ఫిర్యాది
దొండపాటి పణి కుమార్ తండ్రి భాస్కరరావు 29 సంవత్సరాలు నాయి బ్రాహ్మణ అను అతను ఇచ్చిన సమాచారం మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 241/2024 అండర్ సెక్షన్ 179,180, 182, 318(1) r/w 3(5) BNS కేసును దర్యాప్తు చేసి సదరు కేసులో ముద్దాయిలు అయిన
మారుమూడి మధుసూదనరావు తండ్రి బాల సుందరం మల్లాయిగూడెం చింతలపూడి
బిరెల్లి రాంబాబు తండ్రి బుచ్చిబాబు కారు డ్రైవర్, గప్పలవారి గూడెం

కేసు యొక్క వివరాలు ఫిర్యాది ఏలూరు 108 అంబులెన్స్ లో టెక్నీషియన్ గా నాలుగు సంవత్సరాలు నుండి పనిచేస్తున్నట్లు ది 28 7 20 24 నాడు సెల్ ఫోన్ నెంబర్ 8466950693 నుండి ఒక వ్యక్తి ఫోన్ చేసి వారి వద్ద సుమారు 44 లక్షల రూపాయల భారీ అమౌంట్ ఉన్నట్లు మీరు నాకు 10 లక్షల రూపాయలు ఇస్తే 44 మీకు ఇస్తానని ఆశ చూపించినట్లు అంతగా ఫిర్యాదు అంత డబ్బులు లేవని చెప్పగా ఎంత కొంత అడ్వాన్స్ ఇవ్వమని ఫిర్యాదుకి చెప్పగా ఫిర్యాదినీ మూడు లక్షల రూపాయలను అడ్వాన్సుగా ఇవ్వమనట్లు, ది 30.07 2024వ తేదీ నాడు ఫిర్యాది మూడు లక్షల రూపాయలను ఇచ్చినట్లు మరియు మిగతా డబ్బులు కూడా రెడీ చేసుకోమని చెప్పిన విషయంపై ఫిర్యాదు తన యొక్క స్నేహితులకు ఇలాంటి ఈ విషయాన్ని తెలియచేయగా వారు ఇలాంటివి నమ్మకు వాళ్లు నిన్ను మోసం చేస్తున్నారని చెప్పిన దానిపై సదరు వ్యక్తులు ఈరోజు అనగా 03.08.2024 వ తేదీనాడు మధ్యాహ్నం 3 గంటలకు మిగతా డబ్బులు తీసుకుని వస్తున్నానని వారిని కొత్త బస్టాండ్ వెనకాల రైల్వే ప్యాకెట్ దగ్గర తీసుకు రమ్మన్నారు అంతట నేను వారి చేతిలో మోసపోతున్న విషయాన్ని గ్రహించి ఏలూరు త్రీ టౌన్ పోలీస్ వారికి సమాచారం అందించగా వారు ముద్దాయిలను అదుపులోనికి తీసుకున్నారు.

ఈ కేసులో 94 కట్టలు 47 లక్షల రూపాయలు కట్టకి 100 చొప్పున 500 రూపాయల నకిలీ కరెన్సును స్వాధీనం చేసుకున్నట్లు ముద్దాయిలు వద్ద నుండి ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు.

*ఈ కేసులో ఫిర్యాదు అందుకున్న వెంటనే ఈ కేసులో దర్యాప్తును పూర్తి చేసి ముద్దాయిల అరెస్టు చేసి ముద్దాయి ల అరెస్టు లో ప్రతిభ కనబరిచిన ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కాగిత శ్రీనివాసరావు , ఏలూరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ గారు, మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The Eluru District Police, who played fake currency gang games