TRINETHRAM NEWS

భూగర్భ జలాల సంచార నాణ్యత ప్రయోగశాల వాహనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, ఫిబ్రవరి 10: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. భూగర్భ జలాల నాణ్యతను పరీక్షించి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో భూగర్భ జలాల సంచార నాణ్యత ప్రయోగశాల వాహనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, భూగర్భ జలాల శాఖ పెద్దపల్లి ఆధ్వర్యంలో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద భూగర్భ జలాల నాణ్యత విశ్లేషణ కోసం సంచార నాణ్యత ప్రయోగశాల (మొబైల్ క్వాలిటీ ల్యాబ్ ఆన్ వీల్స్) ను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు రామగుండం పరిసర ప్రాంతాలు, ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాల నాణ్యత పై అధ్యయనం చేసి నివేదికల సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా భూగర్భ జలాల అధికారి జి. లావణ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector