ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణం అవుతున్న 42 పడకల ఆసుపత్రి భవనాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, జనవరి – 16 : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన 42 పడకల ఆసుపత్రి భవనాన్ని ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణం అవుతున్న 42 పడకల ఆసుపత్రి భవనాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, జిల్లాలో ప్రజల సౌకర్యార్థం ఆసుపత్రి ప్రాంగణంలో మరో 42 పడకల ఏర్పాటు చేసేలా భవన నిర్మాణం జరుగుతుందని, వీటి పనులను జనవరి చివరి వారం లోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు.
ఆసుపత్రి నిర్మాణ పనులు నాణ్యతతో ఉండాలని, నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం మొదలగు వాటిపై ఇంజనీర్లతో సమన్వయం చేస్తూ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పనులు వేగవంతంగా జరగడంతో పాటు నాణ్యత అంశం లోనూ ఎక్కడ రాజీ పడవద్దు అని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ డా. శ్రీధర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App