TRINETHRAM NEWS

మంత్రి ఇలా కాలో శిథిలావస్థలో ఉన్న మానేరుబ్రిడ్జి

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఉమ్మడి కరీంనగర్ జిల్లా. భూపాలపల్లి జిల్లాల మధ్య ఉన్న అడవి సోమనపల్లి గ్రామం వద్ద ఉన్నమానేరు బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది, వీటి రక్షణ గోడలు కొన్ని చోట్ల ధ్వంసం కాగా మానేరు బ్రిడ్జి దిమ్మలు పగిలిపోయి దిమ్మకు ఉన్న ఇనుప రాడులు బయటకు రావడంతో వాహనాల టైర్లకు తగిలి వాహనాల టైర్లు పగిలిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి,

ఈ బ్రిడ్జిపై ప్రమాద హెచ్చ రిక బోర్డులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని,వాహన దారులు ఆరోపిస్తున్నారు ఈ వంతెన పీవీ నరసింహా రావు హయాంలో నిర్మించిన బ్రిడ్జి

ఈవంతెనపై నుంచి నిత్యం బొగ్గు,ఇసుకను తరలించే భారీ వాహనాలు వెళ్తుం టాయి, అంతేకాకుండా మహారాష్ట్ర, వరంగల్, కరీంనగర్, చెన్నూరు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో నిత్యం రద్దీతో ఆర్టీసీ బస్సులు నడుస్తుంటాయి,

ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఇంతవరకు వచ్చి దానిని చూసిన పాపాన పోలేదని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వంతెన పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే భారీ ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి,

తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉన్న వంతేనకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఎటువంటి ప్రమాదం జరగక ముందే ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వాహనదారులు కోరుకుంటున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

bridge